breaking news
General Secretary IYR Krishnarao
-
సీఎంఓ జాయింట్ సెక్రటరీగా రాజమౌళి
* సీఎం కార్యాలయం నుంచి వెంకయ్య చౌదరి బదిలీ * ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి వి.రాజమౌళి ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. 2003 బ్యాచ్‌కు చెందిన రాజమౌళి ఉత్తరప్రదేశ్ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ఇతర రాష్ట్రాల కేడర్ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీసుకు వచ్చిన ఐఏఎస్, ఐఆర్ఎస్ సర్వీసుకు చెందిన నలుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ, మరో ఏడుగురు అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న వెంకయ్య చౌదరిని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన వెంకయ్య చౌదరిని సీఎం కార్యాలయం నుంచి బదిలీ చేయడంతో ఆ స్థానంలో రాజమౌళిని నియమించారు. వెంకయ్య చౌదరి సీఎం కార్యాలయ ఓఎస్డీగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టే అంశాన్ని పర్యవేక్షించేవారు.ఇప్పుడు రాజమౌళికి అవే బాధ్యతలతోపాటు మరికొన్ని బాధ్యతలను అప్పగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నరేశ్ పెనుమాకను చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ఎండీగా నియమించారు. జి.ఎస్.ఫణికిషోర్‌ను ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. కేవీ సత్యనారాయణను జీఏడీ (ప్రొటోకాల్) సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కె.ధనుంజయ రెడ్డిని వ్యవసాయ శాఖ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డెరైక్టర్ బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా కట్టబెట్టారు. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
* వెయిటింగ్‌లోని 18 మందికి పోస్టింగ్‌లు * మంగళవారం అర్ధరాత్రి జీవో జారీ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఐఏఎస్‌లను భారీస్థాయిలో బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజయవాడలో బుధవారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంతమంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. జేఎస్వీ ప్రసాద్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి ఆయన బదిలీకి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ముక్కు సూటిగా, నిబంధనల మేరకు, ఒత్తిడిలకు లొంగకుండా పనిచేసే వ్యక్తిగా పేరున్న 2004 బ్యాచ్‌కు చెందిన పీఎస్ ప్రద్యుమ్నను సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఎ.బాబును, శ్రీకాకుళం కలెక్టర్‌గా పి. లక్ష్మీనరసింహంను నియమించారు. వివరాలు..