జెమినీ ఫ్రెండ్స్‌ను గెలిపించిన ఆకాశ్
ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: ఆకాశ్ సనా (53 పరుగులు; 7 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జెమినీ ఫ్రెండ్స్ జట్టును గెలిపించాడు. ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జెమినీ జట్టు 81 పరుగుల తేడాతో సలీమ్‌నగర్ జట్టుపై గెలిచింది. మొదటి రోజు ఆకాశ్ అర్ధసెంచరీతో జెమినీ ఫ్రెండ్ 283 పరుగులు చేసింది. రెండో రోజు మంగళవారం సలీమ్‌నగర్ జట్టు 202 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన ఆకాశ్ 7 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో క్రౌన్ జట్టు 48 పరుగుల తేడాతో బడ్డింగ్ స్టార్స్‌పై నెగ్గింది. తొలి రోజు ఆటలో క్రౌన్ 283 పరుగులు చేసింది. శివదత్త 5 వికెట్లు తీశాడు. రెండో రోజు బడ్డింగ్ స్టార్స్ 235 పరుగుల వద్ద ఆలౌటైంది. నీలేశ్ (49), శ్రేయస్ (44), కౌశిక్ (39)లతో పాటు శివదత్త (31) భారీస్కోర్లు చేయలేకపోవడంతో పరాజయం తప్పలేదు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
చార్మినార్ సీసీ: 247 (అసద్ అలీ 94; ప్రతీక్ సాంగ్లీ 6/63), కొసరాజు: 251/2 (యశ్వంత్ 102, రాకేశ్ 74, లోహిత్ 32)
అపెక్స్ సీసీ: 207 (చంద్రశేఖర్ 64; అభిషేక్ 4/50), నిజామ్ కాలేజి: 126 (శరత్ 48; చంద్రశేఖర్ 6/56)
వీనస్ సైబర్‌టెక్: 214 (శ్రీకాంత్ 67), గౌడ్స్ ఎలెవన్: 216/7 (అవినాశ్ 75, వంశీ 46; కళ్యాణ్ 3/69)
బ్రదర్స్ ఎలెవన్: 211 (రాహుల్ 63; యోగేశ్ 5/56), పీఅండ్‌టీ కాలనీ: 215/3 (జితేందర్ త్యాగి 119 నాటౌట్, ఉత్తమ్ 35)