breaking news
Gecko
-
తెలంగాణలో రెండు కొత్త బల్లులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జీవవైవిధ్యంలో మరో రెండు కొత్త సరీసృపాలు చేరాయి. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రెండు కొత్త రకాల బల్లి (హెమిడాక్టైలస్) జాతులను హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఐరోపాకు చెందిన ప్రతిష్టాత్మక ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీ’లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. నల్లగొండ జిల్లా వర్ధమాని గూడెం బస్ షెల్టర్, గుంటు మడుగు ప్రాంతంలో హెమిడాక్టైలస్ కేర్నికాలా బల్లిని కనుగొన్నారు. స్థానికంగా రాళ్ల కుప్పల మధ్య నివసించే అలవాటు ఉండటం వల్ల దీనికి కేర్నికాలా అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది గరిష్టంగా 49 మి.మీ. పొడవుతో వెనుక భాగంలో ముదురు చుక్కలు, నలుపు రంగు రాళ్లపై కనిపించకుండా దాక్కునేలా రంగు కలయిక ఉంటుంది. ఇది రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తుంది. ఇక, వరంగల్ జిల్లా పాకాల్ వన్యప్రాణి అభయారణ్యం పరిసరాల్లో హెమిడాక్టైలస్ కోయాఒరమ్ బల్లిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంత అడవులు, కొండలను సంరక్షిస్తున్న స్థానిక కోయ, గిరిజన తెగ గౌరవార్థం ఈ జాతి బల్లికి కోయాఒరమ్ అని నామకరణం చేశారు. గరిష్టంగా 55.6 మిమీ పొడవుతో ఉండే ఈ బల్లికి బూడిద రంగు శరీరంపై తెల్లటి పువ్వు ఆకారంలో ఉండే నాలుగు ప్రత్యేకమైన మచ్చలు ఉన్నాయి. ఈ రెండు కొత్త జాతుల కలయికతో తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన (ఎండెమిక్) సరీసృపాల సంఖ్య ఆరుకు చేరింది. -
తొండల్లో జంబలకిడి పంబ!
గ్లోబల్ వార్మింగ్ (భూతాపోన్నతి)తో వాతావరణంలో మార్పులొస్తాయని.. సముద్రాలు ఉప్పొంగుతాయని, వ్యాధులు విజృంభిస్తాయని వింటూ ఉంటాం. కానీ... భూమి వేడెక్కితే అప్పుడెప్పుడో వచ్చిన జంబలకిడి పంబ సినిమాలో మాదిరిగా లింగమార్పిడి జరుగుతుందా? మనుషుల మాట ఎలా ఉన్నా... తొండల్లో మాత్రం ఇది వాస్తవమే నని అంటున్నారు ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్తలు. జన్యుపరంగా మగజాతికి చెందిన తొండలు వాతావరణంలో వేడి ఎక్కువ కావడం వల్ల ఆడ తొండల్లా మారిపోతున్నాయని, దాదాపు 131 తొండలను పరి శీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ క్లార్ హోలెలే అంటున్నారు. లింగ మార్పిడికి గురైన తొండలు సాధా రణ తొండల కంటే ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టాయని, వీటి సంతానం ఉష్ణోగ్రత ఆధారంగా లింగమార్పిడికి గురయ్యేవిగా పరిణమించాయని ఆయన వివరించారు. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి.


