ఎలక్ట్రోలక్స్‌తో డీల్ నుంచి వైదొలిగిన జీఈ
స్టాక్‌హోం: గృహోపకరణాల వ్యాపారాన్ని స్వీడన్ కంపెనీ ఎలక్ట్రోలక్స్‌కి విక్రయించే ప్రతిపాదనను జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థ పక్కన పెట్టింది. జీఈ నిర్దిష్టంగా ఇందుకు గల కారణాలను వెల్లడించనప్పటికీ.. గుత్తాధిపత్యం నెలకొనవచ్చన్న సందేహాలతో అమెరికా నియంత్రణ సంస్థలు డీల్‌ను వ్యతిరేకిస్తుండటమే కారణమై ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పంద విలువ 3.3 బిలియన్ డాలర్లు. ఒప్పందం కుదిరితే అమెరికాలో ఒవెన్లు, ఇతర గృహోపకరణాల అమ్మకాల్లో ఎలక్ట్రోలక్స్‌కి గుత్తాధిపత్యం లభించే అవకాశం ఉందని న్యాయశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అమెరికన్ దిగ్గజం వర్ల్‌పూల్ తర్వాత గృహోపకరణాల తయారీ రంగంలో రెండో అతి పెద్ద సంస్థ ఎలక్ట్రోలక్స్.