breaking news
Gatwick airport
-
లండన్ విమానాశ్రయంలోకి డ్రోన్లు
లండన్: బ్రిటన్‌లో రెండో అత్యంత రద్దీ విమానాశ్రయమైన లండన్‌లోని గాట్విక్‌లో రెండ్రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచె వద్ద బుధవారం రెండు డ్రోన్లు ఎగురుతూ కనిపించడంతో అధికారులు ముందస్తు చర్యగా విమానాల రాకపోకలను నిలిపేశారు. మళ్లీ గురువారం మధ్యాహ్నం కూడా ఒక డ్రోన్ కనిపించింది. దీంతో విమానాలు నడిపితే ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమై విమానాల రాకపోకలను అనుమతించడం లేదు. క్రిస్మస్ సెలవులు ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాలకు విమానాల్లో వెళ్లాల్సిన లక్షలాది మంది ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. గురువారం ఒక్క రోజే 760 విమానాలు రద్దయ్యి 1.1 లక్షల మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో బాధ్యత లేని, ఏ మాత్రం అంగీకరించలేని ఘటన అని ఆమె అన్నారు. ఈ డ్రోన్లు ఉగ్రవాదులవైతే కాదని ఓ అధికారి స్పష్టం చేశారు. -
'ప్రతి ముస్లిం ముప్పేనని అమెరికా భావిస్తోంది'
లండన్: అమెరికాలో సెలవులను గడుపాలని, డిస్నీల్యాండ్‌ను పిల్లలకు చూపించాలని తపించిన ఓ తండ్రికి నిరాశ ఎదురైంది. తన సోదరుడు, తొమ్మిది మంది పిల్లలతో కలిసి బయలుదేరిన ఆయనను గేట్‌విక్ విమానాశ్రయంలో అమెరికా అధికారులు విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. బ్రిటన్ వాసి అయిన మహమ్మద్ తారిఖ్ మహమూద్ కుటుంబానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరనున్న విమానంలో ప్రయాణించేందుకు వారిని అనుమతించలేదు. అమెరికా భద్రతా సంస్థ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సంస్థ ఆదేశాల కారణంగానే వారి పట్ల ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై తారిఖ్ మహమూద్ స్పందిస్తూ విమానం ఎక్కనివ్వకుండా తమను అడ్డుకోవడంపై అమెరికా అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వాలని, దీంతో సెలవుల్లో అమెరికా వెళ్లాలన్న తమ ఆశ ఆడియాస అయిందని చెప్పారు. అమెరికాపై జరిగిన దాడులతో ప్రతి ముస్లిం తమకు ముప్పేనని వారు భావించడమే తమను అడ్డుకోవడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై లేబర్ పార్టీ ఎంపీ స్టెల్లా క్రిసీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు లేఖ రాశారు. ఈ విషయమై అమెరికా అధికారుల నుంచి వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేయనున్నట్టు కామెరాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.