breaking news
Gas Cutter
-
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏటీఎం చోరీకి యత్నం.. కటకటాలపాలైన యువకుడు
సాక్షి,న్యూఢిల్లీ: ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 2:15గంటల సమయంలో వీరు ఏటీఎంకు గ్యాస్ కట్టర్ సాయంతో కన్నం వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయారని, గ్యాస్ కట్టర్, సిలిండర్ అక్కడే వదిలి వెళ్లారని వివరించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫూటేజీ పరిశీలించి ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను రాజస్థాన్ దౌసా జిల్లాకు చెందిన కమల్(27), ప్రవీణ్(20)గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏటీఎం చోరీకి సూత్రధారి తానే అని కమల్ విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు డబ్బు కావాలని, అందుకే తన కజిన్ ప్రవీణ్‌తో కలిసి చోరీకి పథకం పన్నినట్లు కమల్ చెప్పాడని తెలిపారు. చదవండి: యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో.. -
స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ
సాక్షి, మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం నక్కలదిన్నే తండాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో క్యాష్ చాంబర్‌ను గ్యాస్ కట్టర్‌తో కోసి డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ విషయం శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏటీఎంలో ఉంచిన నగదు రూ. 22లక్షలు చోరీకి గురయ్యాయని ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ కెఎస్ఆర్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు, సీసీ కెమెరా ఇద్దరూ ఏటీఎం కేంద్రం వద్ద లేకపోవటంతో ఈ ఘటనకు పాల్పడిందెవరనేది తెలియడం లేదు. శనివారం సాయంత్రం పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.