breaking news
ganesh navaratri
-
ఆ గ్రామాల్లో వినాయక చవితి పండుగను చేసుకోరు...!
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి పండుగ సంబరాలతో సందడిగా మారిపోయాయి . ఊరు, వాడ, పట్టణాల్లో..పండుగ వాతావరణంతో సర్వాంగ సుందరంగా మారిపోయాయి. తొమ్మిది రోజులు సాగే ఈ పండుగను ప్రజలంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. విఘ్న వినాయకుడిగా తొలి పూజలందుకునే గణపయ్యను పూజిస్తే ఎలాంటి విఘ్నాలైనా తొలిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే తమ శక్తి కొలది..ఉన్నంతలో ఘనంగా ఈ పండుగను ప్రతిఒక్కరు జరుపుకుంటారు. అలాంటి పండుగను ఆంధ్రప్రదేశ్లోని రెండు గ్రామాలు అస్సలు జరుపుకోనే జరుపుకోవట. ఇప్పటి వరకు ఈ పండుగ జరిగిన దాఖలాలు కూడా లేవట. ఎందుకిలా అంటే..దీని వెనుక పెద్ద కథే ఉంది. మరి అదేంటో చకచక చదివేయండి మరితెలుగు రాష్ట్రాలో వినాయక చవితి సందడి నెలకొన్నప్పటికీ..ఆ రెండు గ్రామాల్లో ఆ ఆనవాళ్లు అస్సలు కనిపించవు. దశాబ్దాలుగా ఆ గ్రామాలు వినాయక చవితిని జరుపుకోవడం లేదట. ఆ గ్రామాలే అనంతపురం జిల్లా బసంపల్లి, విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని లచ్చిరాజుపేట గ్రామాలు. అదే టైంలో జాతర..అనంతపురం బసంపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను జరుపకోకపోవడానికి కారణం గ్రామ దేవత మారెమ్మ జాతర అని చెబుతున్నారు స్థానిక ప్రజలు. మారెమ్మ జాతర తర్వాత వినాయక ఉత్సవం నిర్వహిస్తే గ్రామం పవిత్రత పోతుందని స్థానికుల నమ్మకం అట. అందువల్లే ఇక్కడ గణపతి నవరాత్రులు నిర్వహించుకోరు. పోని చేసుకుందామన్నా..మారెమ్మ జాతర జరిగిన కొద్దిరోజులకే వినాయక చవితి పండుగ రాడంతో ఈ పండుగను జరుపుకోలేకపోతున్నారట. ఈ ఏడాది గ్రామ దేవత మారెమ్మ జాతర మంగవారం (ఆగస్టు 26) రోజు వచ్చింది..ఇవాళ జాతరు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మరుసటి రోజే ఆగస్టు 27న (బుధవారం) వినాయక చవితి రావడం విశేషం. అందుకే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను చేసుకోలేమని చెబుతున్నారు ప్రజలు. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వాళ్లంతా అమ్మవారి జాతర కారణంగానే వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదని అంటున్నారు.అక్కడ పండుగ చేద్దామంటే ..అపశృతి..విజయనగరం జిల్లా లచ్చిరాజం పేట గ్రామంలోని ప్రజలను ఎవరిని అడినా..గణపతి వేడుకలు వద్దు అన్నమాటే వినిపిస్తోంది. ఈ గ్రామం కూడా దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటోంది. పదిహేనేళ్ల క్రితం వినాయకచవితి పండుగ నిర్వహించే ప్రయత్నం చేస్తుండగా..ఓ వ్యక్తి కన్నుమూశారు. మరుసటి ఏడాది చేసుకుందామనుకుంటే..మరొకరు చనిపోయారు. ఇలా వరుసగా మూడుసార్లు జరగడంతో వినాయక చవితి కలిసి రావడం లేదనే అభిప్రాయానికి వచ్చేశారు గ్రామస్తులు. అయితే 2019లో ఒకసారి యువకులు ఈ పండుగను ఎలాగైనా చేసుకోవాలని ప్రయత్నించగా..ఓ పెద్దావిడ కాలం చేసిందట. మళ్లీ కథ మొదటికే వచ్చిందని ఆ ప్రయత్నం విరమించుకున్నారట. ఇతర పండుగలకు ఇలాంటి ఆటంకాలేమి ఉండవని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలోనే చవితి వేడుకలు అనే ఆలోచనే తమ గ్రామంలో లేదంటున్నారు స్థానికులు.(చదవండి: నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!) -
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
-
విఘ్నాధిపతికి వినతుల హోరు
జిల్లా, డివిజన్, మండలాల కోసం.. భూలోకంలో వినాయకుడికి వింత అనుభవం.. నేరడిగొండ : ఇన్ని రోజులు దేవ లోకంలో విహరించిన విఘ్నాధిపతి నవరాత్రులను పురస్కరించుకుని భూలోకం బాటపట్టాడు. వినాయకుడు తన వాహనం ఎలుకపై ఆదిలాబాద్ జిల్లాలో దిగాడు. ఎంత సంబరంగా వచ్చాడో.. అంతే ఆశ్చర్యానికి లోనయ్యూడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తుండడంతో జిల్లా అంతా సందడి నెలకొంది. నవరాత్రులు ముందే వచ్చాయూ అన్న సందేహం వ్యక్తం చేస్తూ.. ఏమయ్యూ మూషికమా ఆదిలాబాద్ జిల్లాలో ఈ హడావుడి ఏమిటో కనుక్కో.. అంటూ పురమాయించాడు. జిల్లాలో పునర్విభజన సాగుతోంది ప్రభూ.. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ, బోథ్ మండలాల ప్రజలు నిర్మల్ జిల్లాలో కలపాలని, ఇచ్చోడ, నేరడిగొండ మండలాలను ఆదిలాబాద్ డివిజన్లో కాకుండా ఉట్నూర్ డివిజన్లో కలపడంతో ఆయా మండలాల ప్రజలు రోడ్లపై రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు స్వామి. నిర్మల్ కావాలి.. వద్దు.. నిర్మల్ జిల్లా కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ప్రభు. ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు కూడా. ఆదిలాబాద్ జిల్లాతోనే కలిపి ఉంచాలని, విడదిస్తే మరింత వెనుకబడుతుందని ఇక్కడి ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వామి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల కోసం ప్రభుత్వానికి వేల సంఖ్యలో విన్నపాలు చేస్తున్నారు. ఆన్లైన్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ప్రభు. నవరాత్రుల్లో మరిన్ని విన్నపాలు మీ వద్దకూ వచ్చేలా ఉన్నాయి స్వామి. గణేషుడు స్పందిస్తూ.. ఏదో ఒక భక్తుడి కోర్కెను తీర్చడం కాదు.. వేలాది మంది భక్తుల మదిలో నెలకొన్న సంశయాలు, కోర్కెలను ఈ తొమ్మిది రోజుల్లో తీర్చగలనా..? నవరాత్రులు ముగిసేసరికి సాధ్యమైనన్ని తీర్చేస్తా.. ఆ పైవన్నీ వాయిదాలకు వదిలేస్తా.. అనుకుంటూ ముందుకు కదిలారు. పాపం రైతులు.. రంగురంగుల ఆహార్యంతో ఠీవీ ఉట్టిపడే మీకు మట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఇదంతా నీ ఆరోగ్యానికే సుమా అంటూ మూషికం చెబుతున్న మాటలతో గణేషుడు ఆలోచనలో పడ్డారు. రైతు కుటుంబాలు సంతోషంగా లేవు. లోకానికి తిండిపెట్టే రైతన్నకే అన్ని కష్టాలైతే ఎలా..? పండించే రైతుకు పెట్టుబడి రావడం లేదు. తిండి గింజలు పండించడానికి అవసరమైన మందులకు ధరలు పెరిగాయి. ఇంటిల్లిపాది కష్టపడినా అప్పులే మిగులుతున్నాయి. కూలీల సమస్యే కాదు.. పంటకయ్యే పెట్టుబడికి తగిన ధరను ప్రభుత్వం అందించేలా పాలకుల మనస్సు మారుస్తాను మూషికమా. ధరలు మండిపోతున్నాయి.. మహారాజా.. ఏ ఇంటికి వెళ్లినా తిండి గింజలు పెద్దగా లేవు. పంచదార ధర పెరిగింది. నీకిష్టమైన లడ్డూలు పెద్దవి లేవు. నీకేం పెడతారు.. డబ్బు లేదు.. కొనుగోలు చేద్దామంటే ఉన్న డబ్బు సరిపోదు. పత్రి, కాయ, ఉండ్రాళ్లు పెట్టాలన్నా ధరలు మండిపోతున్నాయి. చక్కెర, నెయ్యి, పప్పులకు వారానికో, నెలకోసారి ధరలు పెంచుతున్నారు. ప్రజలకు కష్టమై కొనడం లేదు. ఈసారి నీకు బొజ్జనిండదేమో స్వామీ..! -
5 నుంచి దుర్గగుడిపై గణపతి నవరాత్రులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 5 నుంచి 13వ తేదీ వరకు గణపతి నవరాత్రుల మహోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదో తేదీ ఉదయం గణపతి పూజ, కలశస్థాపన, విశేష పత్రి పూజతోపాటు కథా శ్రవణం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీగణపతి హోమం, సాయంత్రం ఆవాహన దేవతా హోమం నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పూర్ణాహుతిలో ఉత్సవాలు ముగుస్తాయని, సాయంత్రం 5 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.