breaking news
Gandhi Hospital in Secunderabad
-
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
హేరాం.. ఎంతటి దైన్యం
పేదల వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు మాత్రం తెలియడం లేదు. ఇక్కడకు వైద్యం కోసం వచ్చేవారంతా నిరుపేదలే. కానీ సిబ్బంది మాత్రం ప్రతి పనికీ ‘ఖరీదు’ కడుతున్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స చేయించుకున్న తర్వాత ప్రతివారం పాస్టిక్సర్జరీ ఓపీ సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ఈ విభాగం మొదటి అంతస్తులో ఉంది. ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదు. గతంలో వచ్చినప్పుడు వీల్‌చైర్ కోసం సిబ్బందిని అడిగినా చేయి తడపందే ఇవ్వనన్నారు. దీంతో అతడు గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చేటప్పుడు ఇంట్లోని పిల్లల సైకిల్‌ను తెచ్చుకున్నాడు. భ్యార తోడుతో దానిపై వెళుతున్న పరిస్థితిని తోటి రోగులు చూసి అవాక్కయ్యారు. – గాంధీ ఆస్పత్రి -
చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి
కర్నూలులో నిందితురాలు పోలీసుల అదుపులో ఆమెకు సహకరించిన వ్యక్తి కిడ్నాపర్ కోసం పోలీసుల మోహరింపు చిలకలగూడ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అపహరణకు గురైన చిన్నారిని కన్నతల్లి ఒడికి చేర్చేందుకు చిలకలగూడ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అపహరించిన వారిని గుర్తించడంలో పురోగతి సాధించారు. ఏ క్షణమైనా నిందితురాలిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు కర్నూలు పట్టణంలో మాటు వేశాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలిపల్లికి చెందిన రేణుక కుమార్తె కావ్య (9 నెలలు)ను శనివారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి విజటర్స్ షెడ్ నుంచి గుర్తుతెలియని మహిళ అపహరించిన సంగతి విదితమే. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం సాయంత్రానికి పురోగతి సాధించారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఘట్కేసర్కు చెందిన రవికుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితురాలు కర్నూలు పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేక నిఘా బృందాలు అక్కడ మోహరించాయి. అదుపులోకి తీసుకున్న రవికుమార్ కూడా మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో నిందితురాలిని పట్టుకోవడంలో కొంతమేర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. కాగా నిందితురాలిని పట్టుకుని చిన్నారిని క్షేమంగా నగరానికి తీసుకువస్తున్నారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని పోలీస్ వర్గాలు కొట్టిపారేశాయి. నిందితురాలిని ఆదివారం సాయంత్రం వరకూ అదుపులోకి తీసుకోలేదని, రాత్రికి, లేదా సోమవారం నాటికి అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌వర్గాలు స్పష్టం చేశాయి. అడ్డంకిగా మారిన ఆదివారం... చిన్నారిని రక్షించేందుకు ఆదివారం అడ్డంకిగా మారినట్లు తెలిసింది. నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్ కర్నూలు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో సర్వీస్ ప్రొవైడర్ల నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందించలేకపోయారని తెలిసింది. సోమవారం నాటికి నిందితురాలిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.