breaking news
G. Sanjiva Reddy
-
సింగరేణి కార్మికులకు సీఎం మోసం
సమ్మెకు కార్మిక ఐక్య సంఘటన నోటీసు: సంజీవరెడ్డి సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని మోసం చేస్తున్నారని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు జి.సంజీవరెడ్డి విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సమ్మెకు దిగనున్నట్ల ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియాతో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు, సకల జనుల సమ్మెకు వేతనం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక సంఘాలతో కలసి సమ్మెకు దిగనున్నామని, ఇందుకు సంబంధించి నోటీసిచ్చామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా రూ. 40 వేల కోట్ల కార్మిక సంక్షేమ నిధితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమాలు చేస్తున్నాయని కుంతియా ఆరోపించారు -
‘కాంట్రాక్టు’ రెగ్యులరైజ్ చేయాలి
లేదంటే రెగ్యులర్ ఉద్యోగులతో కలసి సమ్మె రాష్ట్ర విద్యుత్ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బి 2841 కార్యవర్గ తీర్మానం హైదరాబాద్: విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (బి 2841) కార్యవర్గ సమావేశం తీర్మానించింది. లేదంటే రెగ్యులర్ ఉద్యోగులతో కలసి సమ్మెకు దిగడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మంగళవారం టీఎస్ఈఈ యూనియన్ 327 ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులకు తార్డ్ పార్టీతో నిమిత్తం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించాలని, పనికి తగిన వేతనం అందజేయాలని, ఐదేళ్లు పనిచేసిన కార్మికులందరికి 2 ఇంక్రిమెంట్లు, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ప్రస్తుతం విస్మరిస్తున్నారని విమర్శించారు. -
కార్మికులకు సేవచేస్తూ చనిపోతా
హన్మకొండ : కార్మికులకు సేవ చేస్తూనే చనిపోవాలని ఉందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. భగవంతుడు ప్రత్యక్షమైతే జీవించే వరకూ కార్మికులకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు. హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 అనుబంధ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం బహిరంగ సభ జరిగింది. సభలో జి.సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ విభజించడంలో తేడా ఏమిటో అర్థం కావడంలేదన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడానని చెప్పారు. రెగ్యులరైజేషన్‌లో కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. గతంలో ఏడు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయగా విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లగా వెనక్కి వచ్చారని వివరించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడానికి హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారిందన్నారు. కార్మిక చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. కోర్టు తీర్పులను పూర్తి స్థాయిలో పరిశీలించి విద్యుత్ అధికారులతో చర్చించి రెగ్యులరైజేషన్ కోసం కృషి చేస్తామన్నారు. ఈ లోగా నేరుగా జీతాలు తీసుకోవడాన్ని సాధించుకుందామన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీఎండీ వెంకటనారాయణను ఘనంగా సన్మానించారు. అంతకుముందు హన్మకొండ వడ్డెపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్లో ఐఎన్టీయూసీ జిల్లా అఫీస్బేరర్ల సమావేశం జరిగింది. ఈ సభలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బోంపెల్లి పురుషోత్తంరావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఏపీ సెక్రటరీ జనరల్ సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్‌రెడ్డి, నాయకులు ముత్తయ్య, మహేందర్‌రెడ్డి, హన్మంతరావు, అంజయ్యగౌడ్, రాజిరెడ్డి, సదయ్య, మహేందర్‌రెడ్డి, దారవత్ సికిందర్, దేవేందర్, నీలం ఐలేష్, ఎం.ప్రభాకర్, పుల్లా రమేశ్, ఎ.సుధాకర్, రాజేందర్, లింగమూర్తి, ప్రసాద్, సమ్మిరెడ్డి, శంకర్, ప్రభాకర్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్, రాజమౌళి పాల్గొన్నారు. త్వరలో అనుకూలంగా నిర్ణయం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై వేసిన కమిటీ సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కార్మికులకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కష్టించి పనిచేస్తున్నారు. వీరి కృషి వల్లే వినియోగదారులకు మెరుగైన సేవలందుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగాలన్నదే నా అభిమతం. - కొంటే వెంకటనారాయణ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేయాలి రాష్ర్టంలో కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా ఎత్తి వేయాలి. ఎన్నికలముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాంట్రాక్ట్ విధానం బానిస విధానమని, ఈ విధానం లేకుండా చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 కృషి చేస్తుంది. - శ్రీధర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీఎస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం పర్మనెంట్ చేయాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిలకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగిగా వయస్సు మీరుతోంది. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే బాధ్యతను జి.సంజీవరెడ్డి తీసుకుంటారు. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వారు పర్మనెంట్ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు యాజమాన్యం నేరుగా జీతాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. -జి.మోహన్‌రెడ్డి, విద్యుత్ఉద్యోగుల సంఘంతెలంగాణ, ఏపీ కోఆర్డినేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్మిక సంఘాలు ఏకం కావాలి విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ సాధనకు విద్యుత్ సంస్థల్లోని అన్ని సంఘాలు ఏకమయ్యాయని, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మూడు సంఘాలు ఏకం కాలేకపోతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నట్లుగా ఉంది. విద్యుత్ సంస్థల్లోని అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఏకమై కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేయాలి. వయస్సు మీరుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. - యుగందర్, టీఎస్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి