breaking news
Full power
-
డిజిటల్ అరెస్ట్‌లపై దేశంలో ఎక్కడైనా సీబీఐ దర్యాప్తు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా నేరాలు దేశంలో ఎక్కడ వెలుగు చూసినా దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి పూర్తి అధికారాలు కల్పించింది. అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకుంటున్న ఈ సైబర్ నేరాలను వ్యవస్థీకృత నేరంగా అత్యున్నత న్యాయస్థానం అభివరి్ణంచింది. హరియాణాకు చెందిన 73 ఏళ్ల వద్ధురాలిని నకిలీ ఆదేశాలతో భయపెట్టి రూ.కోటి మేర దోచుకున్న ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. విచారణలో భాగంగా శుక్రవార న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్, స్కైప్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తు సంస్థలు నోటీసులు, సమన్లు జారీ చేయరాదని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 35 ప్రకారం నోటీసులను భౌతికంగానే అందజేయాలని తేలి్చచెప్పింది. ద ర్యాప్తునకు ఆటంకాలు లేకుండా అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం–1946 కింద సీబీఐకి అనుమతులు ఇవ్వాల ని ఆదేశించింది. సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్మును గుర్తించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెరి్నంగ్ టూల్స్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంక్‌కు సూచించింది. ఏకంగా మూడు వేల కోట్లు కొట్టేశారుడిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాల తీవ్రతను గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 1.23 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులు నమోదయ్యాయి. కేవలం ఆ ఒక్క ఏడాదే బాధితుల నుంచి రూ.1,935 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. 2025 మొదటి రెండు నెలల్లోనే కొత్తగా 17,718 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు మొత్తంగా సుమారు రూ.3,000 కోట్ల మేర సీనియర్ సిటిజన్లు, ఇతర సామాన్యుల నుంచి నేరగాళ్లు లాగేసినట్లు అంచనా. మన దేశ చట్టాల్లో గుర్తింపు లేదుడిజిటల్ అరెస్ట్ అనే పదానికి దేశ చట్టాల్లో ఎలాంటి గుర్తింపూ లేదని న్యాయస్థానం తెలిపింది. వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్, విచారణల పేరుతో బెదిరింపులకు గురిచేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 కల్పిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇవి కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న వ్యవస్థీకృత నేరాలని స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 111 కింద సైబర్ నేరాలపై కేసులు నమోదు చేయాలని సూచించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) అధికార పరిధి సమస్యలు తలెత్తకుండా ‘మకోకా’లాంటి కఠినమైన చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.మోసం సాగుతోందిలా... పోలీసులు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారుల పేరుతో నేరగాళ్లు బాధితులకు వీడియో కాల్స్ చేస్తారు. నకిలీ యూనిఫాంలు, ఐడీ కార్డులు, సెట్టింగులతో నమ్మిస్తారు. డ్రగ్స్ పార్శిల్, మనీ లాండరింగ్ లాంటి తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారని భయపెడతారు. ఎవ్వరితోనూ మాట్లాడనివ్వకుండా రోజుల తరబడి వీడియో కాల్‌లోనే ఉంచుతూ మానసికంగా వేధిస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. భయపడిన బాధితులు అడిగినంత డబ్బు పంపగానే నేరగాళ్లు అదృశ్యమవుతారు. వాస్తవానికి వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హైడ్రాకు ఫుల్ పవర్స్
-
ఢిల్లీ ఎల్జీకి ఫుల్ పవర్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు, కమిషన్, అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలనైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది. అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులను కూడా ఇకపై ఎల్జీయే నియమించవచ్చు. ఈ మేరకు ఆర్టికల్ 239, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం–1991 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి వద్ద ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ప్రతిష్టాత్మకమైన అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మోదీ సర్కారు ఈ చర్యకు దిగడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి పదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండటం తెలిసిందే. ఢిల్లీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు తరచూ కోర్టుల దాకా వెళ్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు ఆప్‌కు అనుకూలంగా వచ్చినా చట్ట సవరణల ద్వారా కేంద్రం వాటిని పూర్వపక్షం చేస్తూ వస్తోంది. -
పరిశ్రమలకు ఫుల్ పవర్
పవర్‌హాలిడేను ఎత్తేసిన ప్రభుత్వం మూడు నెలలుగా కరెంటు ‘కట్’ కట నేటి నుంచి నిరంతర విద్యుత్తు సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా విద్యుత్తు సంక్షోభంతో తల్లడిల్లుతున్న పరిశ్రమలకు శుభవార్త. గురువారం ఉదయం నుంచీ పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగియటంతో పాటు విద్యుత్తు డిమాండ్ తగ్గిన దృష్ట్యా పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించనుంది. ఈ మేరకు టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జి.రఘుమారెడ్డి తెలిపారు. రెండ్రోజులు ముందుగానే టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు కోతలను ఎత్తివేశారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ప్రభుత్వ అంచనాలు దాటిపోయింది. పంట కాలం కావటం... రైతుల ఆందోళనల దృష్ట్యా వ్యవసాయానికి కనీసం ఆరు గంటల సరఫరా అనివార్యమైంది. దీంతో పరిశ్రమలపై కోత విధించటం మినహా గత్యంతరం లేదని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు విద్యుత్తు కోత విధించింది. అప్పటి వరకు అమల్లో ఉన్న ఒకరోజు పవర్ హాలిడేను... అక్టోబర్ 8 నుంచి రెండు రోజులకు పెంచింది. గత నెలాఖరు నుంచి రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా కుదుటపడింది. వర్షాలతో విద్యుత్తు డిమాండ్ కొంత మేరకు తగ్గింది. విద్యుత్తు డిమాండ్, విద్యుత్తు లభ్యతను సమీక్షించిన ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడేను ఒక రోజుకు కుదించింది. ప్రస్తుతం పరిస్థితి మరింత మెరుగుపడింది. అక్టోబర్‌లో సగటున 160 నుంచి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్తు డిమాండ్ ఉంటే.. ఇప్పుడది 125-130 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఖరీఫ్ సీజన్ ముగియటంతో వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తు ఆదా అయింది. చలి కాలం కూడా మొదలవటంతో వారం రోజులుగా విద్యుత్తు డిమాండ్ తగ్గింది.


