ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా రవీంద్ర మోదీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా 2016-17 సంవత్సరానికిగాను హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోదీ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆహార పరిశ్రమలో 30 ఏళ్లకుపైగా అనుభవం ఆయన సొంతం. సూర్య బ్రాండ్‌తో మసాలాలు, ఇతర ఆహారోత్పత్తులను హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయిస్తోంది. ఇక ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా గౌర పెట్రోకెమ్ ఎండీ గౌర శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎనిమిదేళ్లుగా ఫ్యాప్సీలో వివిధ హోదాల్లో పనిచేశారు.