breaking news
fruit merchant
-
వడదెబ్బతో ఐదుగురి మృతి
నల్లబెల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో అస్వస్థతకు గురై ఐదుగురు మృతిచెం దారు. మృతుల్లో ఇద్దరు గొర్రెల కాపరులు ఉన్నారు. నల్లబెల్లికి చెందిన గొర్రెల కాపరి నానెబోయిన రాజలింగయ్య(60) రోజులాగే ఆదివారం గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం తీవ్ర అస్వస్థతతో ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతిచెందా డు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. మృతుడికి భార్య లచ్చమ్మ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఖానాపురంలో మరొకరు.. ఖానాపురం : మండలంలోని పెద్దమ్మగడ్డకు చెందిన గొర్రెల కాపరి భూక్య చంద(25) రోజులాగే ఆదివారం గొర్రెలను మేతకు తోలుకెళ్లాడు. సాయంత్రం అస్వస్థతకు గురయ్యా డు. సోమవారం ఉదయం పరిస్థితి విషమిం చ గా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. పరకాలలో ఒకరు.. పరకాల : పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెంది న మడికొండ సంపత్(38) రబీలో వరి పంట ను సాగుచేస్తున్నారు. పంట కోతకు రావడం తో ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లా డు. ఈ క్రమంలో ఎండవేడికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకుంటూ రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంపత్ మృతితో కాలనీలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి. జనగామలో పండ్ల వ్యాపారి.. జనగామ టౌన్ : పట్టణంలోని గిర్నిగడ్డకు చెందిన పండ్ల వ్యాపారి మహ్మద్ చాంద్‌పాషా(35) ఆదివారం ఎండదెబ్బతో పాషా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మరణించారని స్థానికులు తెలిపా రు. మృతుడికి వృద్ధురాలైన తల్లితోపాటు కూతురు, నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మిలాద్ సోషల్ వేల్ఫేర్ కమిటి సభ్యులు అన్వర్, ఎజాజ్, డిమాండ్ చేశారు. రఘునాథపల్లిలో కిరాణ వ్యాపారి.. రఘునాథపల్లి : మండల కేంద్రానికి చెందిన గొల్ల వెంకన్న(44) పాతబస్టాండ్ వద్ద కిరాణంషాపు నిర్వహిస్తున్నాడు. ఆయన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సోమవారం ఉదయం తన భార్య సత్యవతి, కుటుంబ సభ్యులను పంపాడు. మధ్యాహ్యం తాను వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు కోసం ఎదురు చూస్తుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురై పడిపోయాడు. ప్రయాణికులు గుర్తించి స్టేషన్‌మాస్టర్‌కు సమాచారమిచ్చారు.ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు మద్యం మత్తులో ఆహారం, నీరు తీసుకోకపోవడంతో వడదెబ్బకు గురై మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. -
స్నేహితుడు లేని ఊరు!
బౌద్ధ వాణి ధనుంజయుడు ఒక పండ్ల వ్యాపారి. ఒకనాడు బండినిండా పండ్ల బుట్టలు ఎత్తుకుని అమ్మకానికి ఒక గ్రామం వెళ్లాడు. ఆ గ్రామంలో ఒక దారి పక్కన ఒక చెట్టు నీడలో నలుగురు యువకులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారు పండ్ల వ్యాపారిని చూశారు. ఎలాగైనా పండ్లు తిందామనుకున్నారు. కానీ తమలో ఏ ఒక్కరి దగ్గరా డబ్బు లేదు. అయినా వెళ్లి అడిగితే కాదనడులే అనుకున్నారు. మొదట ఒకడు వెళ్లి ‘‘ఒరేయ్ ఆకలిగా ఉంది, ఒక పండు ఇవ్వరా’’ అన్నాడు. వ్యాపారి ఆలోచించి అతడికి ఒక కుళ్లిన పండు ఇచ్చాడు. రెండోవాడు వెళ్లి ‘‘అన్నా! ఒక పండు ఇవ్వవా?’’ అని అడిగాడు. వాడికి వర్తకుడు ఒక మంచి పండు ఇచ్చాడు. మూడోవాడు కూడా వెళ్లి ‘‘అయ్యా! ఒక పండు ఇవ్వండి’’ అన్నాడు. వ్యాపారి వాడికి నాలుగైదు పండ్లు ఇచ్చాడు. చివరిగా నాలుగోవాడు వెళ్లి ‘‘మిత్రమా! నాకూ ఒక పండు ఇవ్వగలవా?’’ అని అడిగాడు. వ్యాపారి వెంటనే బండిని ఆపి, ఒక పండ్ల బుట్టను అతనికి అందించి, ‘‘మిత్రమా కావాలంటే ఇంకా తీసుకో’’ అన్నాడు. ‘‘మొదటి వాణ్ణి మూర్ఖునిగా, రెండోవాణ్ణి సోదరునిగా, మూడోవాణ్ణి బిడ్డగా, నాలుగో వాణ్ణి మిత్రునిగా భావించడం వల్లే అలా చేశాడు’’ అని బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘స్నేహితుడు లేని ఊరు అడవితో సమానం’’ అన్నాడు. - బొర్రా గోవర్థన్