breaking news
four-year-old son
-
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
తండ్రికి బదులు నాలుగేళ్ల కుమారుడు అరెస్ట్
టీనగర్: సారారుు వ్యాపారిని అరెస్టు చేయడం వీలుకానందున అతని నాలుగేళ్ల కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరక్కోణం ప్రాంతంలో దొంగసారా విక్రయాలను అడ్డుకునేందుకు ఎకై ్సజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరుపుతూ వచ్చారు. మేల్ఆవత్తం గ్రామానికి చెందిన వేదగిరి (35). ఇతను సారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వేదగిరిపై ఇదివరకే సారా విక్రయం, ఇసుక చోరీ కేసులు పెండింగ్లో ఉన్నారుు. ఇలావుండగా ప్రత్యేక దళం పోలీసులు సారా వ్యాపారి వేదగిరిని అరెస్టు చేసేందుకు మేల్ఆవత్తం గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. అతని భార్య, నాలుగేళ్ల కుమారుడిని ప్రైవేటు పాఠశాల వ్యానులో ఎక్కించి ఇంటికి చేరుకున్నారు. ఆమె వద్ద పోలీసులు విచారణ జరపగా భర్త ఇంట్లో లేడని, తన కుమారుని పాఠశాల వ్యానులో ఎక్కించి వస్తున్నట్లు తెలిపారు. వెంటనే పోలీసులు పాఠశాల వ్యానును వెంబడించి అందులో ఉన్న వేదగిరి నాలుగేళ్ల కుమారుడిని అరక్కోణం తాలూకా పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. అంతేకాకుండా సంగీతతో భర్తను తీసుకువస్తేనే బిడ్డను విడిపిస్తామని తెలిపారు. వెంటనే సంగీత అన్వర్తిఖాన్పేటలోగల పాఠశాలకు వెళ్లారు. అక్కడ పాఠశాల యాజమాన్యంతో మీ పాఠశాల వ్యానులో తీసుకువెళ్లిన బిడ్డను పోలీసులు పట్టుకువెళ్లారని, ఇందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని వాగ్వాదం జరిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన పాఠశాల యాజమాన్యం పోలీసు స్టేషన్కు వెళ్లి బాలుని రక్షించి సంగీతాకు అప్పగించారు. దీనికి సంబంధించి డీఐజీ తమిళరసన్, పోలీసు సూపరింటెండెంట్ పలగవన్లకు సంగీత ఫిర్యాదు చేశారు. దీనిగురించి విచారణ జరపాల్సిందిగా వారు ఆదేశాలు ఇచ్చారు.