breaking news
founder of Rayalaseema Parirakshana Samithi
-
ఒక్క అమరావతి మీదే ఎందుకింత ప్రేమ?
కడప : రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ 300 ఏళ్లకు సరిపడే అపారమైన ఖనిజ సంపద సర్వే ఫలితాలు ఎందుకు బయటపెట్టడం లేదని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో బయటపడ్డ ఒక్క పుల్లరిన్ ఖనిజ సంపదతోనే ఆంధ్రప్రదేశ్లో మొత్తం తారు రోడ్డులకు బదులు బంగారు రోడ్డులు వేయించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రానికి సంపదనిచ్చే రాయలసీమను కాదని ఒక్క అమరావతి మీదే ఎందుకింత ప్రేమ అని ముఖ్యమంత్రి చంద్రబాబును బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రశ్నించారు. -
పుష్కర నిధులు ‘తమ్ముళ్ల’ జేబుకే
సర్కారుపై బెరైడ్డి ధ్వజం ఆగష్టు 12 నుంచి రాయలసీమ పుష్కరాలు నందికొట్కూరు: ‘సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తెచ్చి కృష్ణా పుష్కర స్నానాలు చేయమంటున్నారు.. ఆయనకేమైనా మతి ఉంది మాట్లాడుతున్నారా?. ఆ నీటిలో పుష్కర స్నానం చేస్తే పాపాలు పోకపోగా మరిన్ని అంటుకుంటాయి’ అంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పిచ్చోడి చేతి రాయి అనే చందంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.1277 కోట్లు మంజూరు చేసిందని, అయితే ఇందులో 75శాతం నిధులను టీడీపీ నాయకులు, కార్యకర్తలే కొల్లగొట్టారని ఆరోపించారు. కృష్ణ పురష్కరాల నిధులు తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకేనని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. ఆగస్టు 12న రాయలసీమ పుష్కరాలు ఆగష్టు 12 సాయంత్రం 4 గంటలకు రాయలసీమ పురష్కరాలు ప్రారంభిస్తునట్లు బెరైడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి మంది మత్తయిదువులతో కృష్ణమ్మకు మంగళహారతులిచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. 13న హోమాలు నిర్వహిస్తునట్లు చెప్పారు.