breaking news
Foster company
-
ఫోస్టర్ పిల్లల కోసం మెలానియా ట్రంప్ భారీ స్కాలర్షిప్లు
అమెరికా: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫోస్టర్ కేర్‌లో (రక్షణ గృహాల్లో) పెరుగుతున్న పిల్లల ఉన్నత విద్య కోసం భారీ స్కాలర్షిప్ నిధిని ప్రకటించారు. వారి చదువులు, ఇతర అవసరాల కోసం 7.2 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.60 కోట్లకు పైగా ఆమె కేటాయించారు. నవంబర్ 7న లూసియానా స్టేట్-అలబామా యూనివర్సిటీల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.ఫోస్టర్ కేర్ వ్యవస్థలో పెరిగిన యువతకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మెలానియా ‘ఫోస్టరింగ్ ది ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా అమెరికా దేశవ్యాప్తంగా 26 విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీంతో విద్యార్థులకు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అవసరాలకు కూడా ఆమె ఆర్థిక సహాయం అందించనున్నారు.ఈ సందర్భంగా మెలానియా మాట్లాడుతూ.. ఫోస్టర్ కేర్ నుంచి వచ్చిన యువతకు స్థిరమైన భవిష్యత్తు, నాణ్యమైన విద్యతో పాటు జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశాన్ని ఈ స్కాలర్షిప్లు కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్య ఒక వ్యక్తికి ఎవరూ దూరం చేయలేని గొప్ప ఆస్తి అని అన్నారు. కార్యక్రమంలో స్కాలర్షిప్ పొందిన విద్యార్థులతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడి ఫొటోలు దిగారు.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా FSSAI దాడులు.. రూ.81 కోట్ల విలువైన ఆహార పదార్థాలు సీజ్ -
తుది డిజైన్లు వచ్చాయి
వీటిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు నేడు మంత్రులతో సమావేశం సాక్షి, అమరావతి: రాజధాని పాలనా నగరంలో హైకోర్టు భవనం డిజైన్‌పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ...హైకోర్టు భవనం లోపల సౌకర్యాలు, అంతర్గత నిర్మాణ శైలిపై న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. బాహ్య ఆకృతి మాత్రం తనతోపాటు అందరికీ నచ్చేలా ఉండాలన్నారు.హైకోర్టు బాహ్య డిజైన్ అద్భుతంగా ఉండేలా రూపొందించి తీసుకురావాలన్నారు. మిగిలిన డిజైన్ల అంతర్గత నిర్మాణ శైలి బాగుందని, బాహ్య ఆకృతులపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు. వీటిపై మంత్రులు, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు గురువారం ఉదయం పది గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు అంతస్తుల్లో అసెంబ్లీ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్ల ప్రకారం అసెంబ్లీ భవనం వజ్రాకృతిలో నాలుగంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్థును నాలుగు భాగాలుగా విభజించి మధ్యలో పబ్లిక్ ప్లేస్ ఉంచారు. మొదటి అంతస్థును మంత్రులు, సీఎం, స్పీకర్, పబ్లిక్, ప్రెస్ కోసం కేటాయించి వాటికి నాలుగు వైపులా ద్వారాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, మండలి కోసం రెండు వేర్వేరు భవనాలు ఈ సముదాయంలోనే అంతర్గతంగా ఉంటాయి. శాసనసభ కింది అంతస్థులోని మధ్య భాగం నుంచి వజ్రాకృతి మొదలై మొత్తం భవనంపై అంతస్థు వరకూ ఉంటుంది. సచివాలయానికి సంబంధించి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒకే ప్రాంగణంలో ఉండాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో రెండు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.


