breaking news
flu fever
-
తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) జ్వరం స్వైరవిహారం చేస్తోంది. పెద్దఎత్తున ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే ఇవేమీ కొత్త జ్వరాలు కావు. దాదాపు ప్రతి ఏడాదీ వస్తూ ఉండే సీజనల్ జ్వరాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఇవి వైరస్ వల్ల వచ్చే జ్వరాలు కావడంతో ప్రతి ఏడాదీ... ఇన్ఫ్లుయెంజా వైరస్ తన జన్యుస్వరూపం మార్చుకుంటూ వచ్చిన... ప్రజలను బాధిస్తూ ఉంటుంది. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే... ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్‌తో వచ్చే జ్వరం కావడం వల్ల దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. దీనికి యాంటీవైరల్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైరస్ సోకిన 48 గంటలలోపు ఇవ్వకపోతే ఆ వైరస్ నశించదు. అటు తర్వాత వైరస్ తీవ్రత దానంతట అదే నెమ్మదిస్తుంది. కాకపోతే ఈలోపు మనిషిని తీవ్రమైన నీరసానికి, నిస్సత్తువకూ గురిచేసి బాధిస్తాయి. ముప్పు ఎవరెవరిలోనంటే... ఆస్తమా, ఎంఫసిమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు.డయాబెటిస్ బాధితులు వృద్ధులు, చిన్నపిల్లల వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు, గర్భిణులూ, గుండెజబ్బు బాధితుల వంటి వారిలో ఫ్లూ జ్వరం ప్రమాదకరం కావచ్చు. లక్షణాలు ఇలా... హెచ్1ఎన్1లో కనిపించే తొలి లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా వైరల్ జ్వరం లాగానే ఉంటాయి. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం (హై ఫీవర్... ఇది ఒక్కోసారి 103 ఫారెన్‌హీట్ వరకూ పెరగవచ్చు) ,పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు ఎర్రబారడం, తీవ్రమైన ఒళ్లునొప్పులు ,బాగా నీరసంగా అనిపించడం, కొందరిలో కడుపునొప్పి కూడా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు వాటంతట అవే తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పుల వంటివి రెండు వారాల వరకు తగ్గకపోవచ్చు. జ్వరం అనంతర దుష్ప్రభావాలుచాలామందిలో లక్షణాలు తగ్గిపోయినప్పటికీ కొందరిలో మాత్రం వైరస్ ఊపిరితిత్తుల వరకు చేరి వైరల్ న్యూమోనియాకూ, ఇంకొందరిలో వైరల్ న్యూమనైటిస్కూ, ఇది మరికొందరిలో మరింత తీవ్రమైతే ఏఆర్డీఎస్ (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రేస్ సిండ్రోమ్) అనే తీవ్రమైన శ్వాస సమస్యలకూ దారితీయవచ్చు. అరుదుగా ఇంకా మరికొందరిలో గుండె కండరం కాస్తంత దెబ్బతిని గుండె కండరాల వాపు (మయోకార్డిటిస్) సమస్య రావచ్చు. ఇక ఈ ఫ్లూ ప్రభావం కారణంగా వ్యాధినిరోధక శక్తి కొద్దిగా తగ్గడం వల్ల మరికొందరిలో ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కనిపిస్తుందంటే... మన దేశంలో హెచ్1ఎన్1 కేసులు సాధారణంగా రెండు సీజన్లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటిదశల్లో వర్షాకాలంలో అంటే... జూలై నుంచి అక్టోబర్ వరకు (ప్రస్తుతం ఈ స్పెల్ నడుస్తోంది) ఇక రెండో దశ చలికాలంలో అంటే... ప్రధానంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఆ టైమ్‌లో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. సాధారణంగా సీజనల్ ఫీవర్లా వచ్చే ఈ ఫ్లూ పెద్దగా ప్రమాదకరం కాదుగానీ... మొదటి 48 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాదాపు తేలిగ్గానే తగ్గిపోయే ఈ ఫ్లూ జ్వరం మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. అందుకే మొదటి 48 గంటల సమయం కూడా కీలకమని గుర్తించాలి. ఫ్లూ వ్యాప్తి ఇలా... ఈ ఫ్లూ జ్వరం తాలూకు వైరస్ గాలి ద్వారానే ఒకరి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంటుంది. ప్రధానంగా వ్యాధి సోకిన బాధితుడు మాట్లాడుతున్నప్పుడు, దగ్గుతున్నప్పడు లేదా తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.పరోక్ష పద్ధతుల్లోనైతే... బాధితుడి తుంపర్లు డోర్ నాబ్స్ మీద లేదా వారు వాడిన ఫోన్ మీదగానీ లేదా వారు ముట్టుకున్న మెట్ల రెయిలింగ్స్ మీద పడ్డ తర్వాత, వేరొకరు వాటిని ముట్టుకున్నప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ తరహా వ్యాప్తిని ‘ఫోమైట్’వ్యాప్తిగా చెబుతారు. వైరస్ సోకగానే లక్షణాలు బయటకు కనిపించకపోయినప్పటికీ... అప్పట్నుంచే వైరస్ అతడి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అలాగే జ్వరం మొదలయ్యాక దాదాపు వారం రోజుల వరకు వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.నివారణ మార్గాలు ఇలా.. కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తల వంటివి అంటే మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్స్ వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఇంటి కిటికీలు తెరిచి గాలి సరిగా తిరిగేలా చేయడం ద్వారా మూసిన గదుల్లో వైరస్ వ్యాప్తి అవకాశాన్ని తగ్గించాలి. నీళ్లు, గోరు వెచ్చని సూప్, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు / ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు, డయాబెటిస్ బాధితుల వంటి వారు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు ఫ్లూ నివారణ కోసం ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.జలుబుతో ఇవీ పోలికలు... ఈ ఫ్లూ జ్వరానికి సాధారణ జలుబుతోనూ కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. సాధారణ జలుబులోలాగే ఒళ్లునొప్పులూ కనిపించవచ్చు. అయితే మొదట్లో పొడి దగ్గు వస్తూ ఉన్నప్పటికీ క్రమంగా తర్వాత్తర్వాత కళ్లె పడటం, ముక్కునుంచి స్రావాలు రావడమూ కనిపిస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. వీటితో పాటు మెడికల్ ఎమర్జెన్సీని సూచించే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రధానంగా శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ లోపలికి లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలుంటాయి. పెదవులు లేదా చర్మం నీలంగా మారడం, అయోమయం, తీవ్రమైన నీరసం/నిస్సత్తువ ఉంటాయి. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ మోతాదులు వేగంగా తగ్గుతూ పోవడం ఆక్సిజన్ తగ్గిన లక్షణాలు, రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా పడిపోవడం కళ్లె / తెమడలో రక్తపు చారిక కనిపించడం వంటివి కనిపిస్తాయి.చికిత్స తీసుకోవడం తప్పనిసరి.. సాధారణంగా బాధితులు తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇది వైరల్ ఫీవర్ కావడంతో దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. అందుకే ఈ సమస్యకు ‘ఒసెల్టామివిర్’(టామీ ఫ్లూ) అనే యాంటీ వైరల్ మందును ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మొదటి 48 గంటలలోపు ఇవ్వడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. లక్షణాలు బలంగా కనిపిస్తూ సమస్యలు తీవ్రమైనప్పుడు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తూ చికిత్స ఆలస్యం చేయకూడదనే వైద్య మార్గదర్శకాలు ఉన్నందున తమ అనుభవంతో ఫ్లూను అనుమానించినప్పుడు డాక్టరు యాంటీ వైరల్ మందు ‘ఒసెల్టామివిర్’ను ఇస్తారు.ఇదీ చదవండి: శానిటైజర్ మితిమీరి వాడడం.. చర్మానికి హానికరంఅయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. ఈ ఫ్లూ ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకి వాటి లక్షణాలూ కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ ఇస్తారు. దగ్గు తగ్గడానికి కాఫ్ సిరప్‌లను సూచిస్తారు. కొందరిలో ఫ్లూ తీవ్రంగా మారి, ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై, రక్తంలో ఆక్సిజన్ తగ్గి, ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితీ రావచ్చు. బాధితుల్లో ఆక్సిజన్ సాచ్యురేషన్ తగ్గినప్పుడు ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వాల్సిరావచ్చు. అందుకే పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ మోతాదు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి. – సాక్షి హెల్త్ డెస్క్ -
వైరస్‌లూ తెచ్చే అనర్థం నిమోనియా
మామూలు ఫ్లూ జ్వరం (ఇన్ఫ్లుయెంజా) మొదలుకొని ఇప్పుడొచ్చే కరోనా అయినా నేరుగా మనిషిని చంపలేదు. వైరస్ సోకాక సెకండరీ ఇన్ఫెక్షన్లా వచ్చే నిమోనియాతో మనిషి మరణం అంచులకు వెళ్తాడు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు మరింత ఎక్కువ. ఇప్పుడొస్తున్న కరోనాగానీ... ఒకప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బర్డ్‌ఫ్లూ (హెచ్1ఎన్1), సార్స్, స్వైన్‌ఫ్లూ, మధ్యప్రాచ్యాన్ని భయపెట్టిన మెర్స్ వంటి వైరస్ల వల్ల వచ్చిన జ్వరాలు ఆ తర్వాత నిమోనియాకు కారణమవుతాయి.అలాంటి నిమోనియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మన ఊపిరితిత్తుల ద్వారా అనుక్షణం శ్వాసిస్తూ ఉంటామన్న విషయం తెలిసిందే కదా. అప్పుడే మన ప్రాణాలు నిలబడతాయి. ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచెలో ఉండే గాలి గదులను ‘ఆల్వియోలై’ అంటారు. ఈ ఆల్వియోలైలోనే బయటి నుంచి ఆక్సిజన్ మన శరీర అవయవాలకు అందడం, అక్కడే లోపలి కలుషితమైన గాలి బయటికి రావడం వంటి గ్యాసెస్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఆల్వియోలైలో ఈ కార్యక్రమం జరగడానికి అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. నిమోనియాకు కారణాలు ఇప్పటి కరోనా మాత్రమే గాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. ప్రధానంగా అవి... ♦ బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల. ♦ ఫంగస్ వల్ల కూడా నిమోనియా వస్తుంది. ♦ కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). కరోనా మొదలుకొని ఏ వైరస్ అయినా సోకడానికి ప్రధాన కారణం కాబట్టి గుంపులుగా వ్యక్తులుండే ప్రదేశాలకు అవసరమైతే తప్ప వెళ్లకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పక ధరించాలి. ♦ ఆల్కహాల్ తాగడం – దీనివల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తు లో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. ♦ మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుడానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. నిమోనియా లక్షణాలుసాధారణ నిమోనియాలో... ♦ దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడం ♦ కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ♦ నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు. ♦ నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా రావచ్చు. ♦ అసహజంగా అనిపించే ఇంటర్‌స్టిషియల్ నిమోనియాలో దగ్గు కూడా ఉంటుంది. ఇది ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఫెయిలయ్యే అవకాశమూ ఉంది. ♦ ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం. గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ఎగ్జుడస్ అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ♦ ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు. ♦ కొందరు రోగుల్లో ఛాతీలో తీక్షణమైన నొప్పి (షార్ప్ పెయిన్) రావచ్చు. సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే... ఏ కారణం వల్ల నిమోనియా వచ్చినప్పటికీ దానికి చికిత్స తీసుకోకపోతే అది మరింత సంక్లిష్టతలకు దారితీస్తుంది. అంటే దాని ఇతర కాంప్లికేషన్లయిన సెప్టిసీమియా (అంటే రక్తానికి అంతా ఇన్ఫెక్షన్ సోకి, రక్తమంతా విషపూరితంగా మారడం) వంటివి కనిపిస్తాయి. అంతేకాదు... రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం వంటివి రావచ్చు. చివరికి మరణం కూడా సంభవించవచ్చు. మరికొన్ని జబ్బుల్లో కూడా... మరికొన్ని జబ్బులు ఉన్నప్పుడు నిమోనియా సోకడం చాలా సాధారణం. డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇలాంటి వ్యక్తులకు వైరస్ సోకితే మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే వారు మరణించే అవకాశాలు ఎక్కువ. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను సక్రమంగా గుర్తించి, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే అది ఎన్నో కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. వ్యాధి నిర్ధారణ ♦ రోగిలో కనిపించే లక్షణాలను బట్టి ♦ సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ♦ ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు. నివారణ ♦ పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్లతోపాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దీన్ని నివారించవచ్చు. ♦ పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి. ♦ బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి. ♦ ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు. ♦ అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతోపాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. చికిత్స ♦ నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ♦ ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని గుర్తుంచుకోండి.- డాక్టర్ ఎస్. మల్లికార్జున్ రావు,సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
చలి చంపేస్తోంది!
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: బారెడు పొద్దెక్కినా నిద్ర లేచేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాయామం చేసేందుకు తెల్లవారుజామున బయటకొస్తే చలి కొరికేస్తోంది. సాయంత్రం నుంచే ప్రజలు ముడుచుకుపోతున్నారు. వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలు దాటినా తీవ్రత తగ్గడం లేదు. గరిష్టంగా 30, కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత నెల రోజులుగా వరుస తుపానులే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇకపై చలి తీవ్రత మరింత పెరుగుతుందనే సమాచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మఫ్లర్లు, స్వెట్టర్లు, దుప్పట్లు, మంకీ క్యాప్‌లకు గిరాకీ పెరుగుతోంది. చిన్న పిల్లలను బయట తిప్పేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, ఆస్తమా, అలర్జీ బాధితులు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త - డాక్టర్ జి.సుధాకర్, చిన్నపిల్లల వైద్యనిపుణులు చలికాలంలో బరువు తక్కువగా ఉండి జన్మించిన పిల్లలు, నెలలు నిండకముందే జన్మించిన చిన్నారులతో పాటు ఏడాదిలోపు వయస్సు చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరి శరీర ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్, 98.4 ఫారెన్‌హీట్ డిగ్రీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్లలో ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నులకమంచం కింద కుంపట్లు పెట్టేవారు. అలా కాకపోతే రూంహీటర్లు వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయించకూడదు. గోరువెచ్చని నీటితో కాస్త ఎండపడ్డాక 5 నిమిషాల్లో స్నానం ముగించాలి. వ్యాధుల బారిన పడితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.


