breaking news
floral tributes
-
మహానేతకు జగన్, షర్మిళ ఘన నివాళి
-
YSRCP ప్లీనరీకు ఏర్పాట్లు పూర్తి
-
మహానేతకు జగన్ ఘన నివాళి
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆ మహానేత సమాధికి జననేత జగన్ తో పాటు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశం ప్రారంభం కానుంది. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి, మృతి చెందిన పార్టీ నేతలకు సంతాప ప్రకటన చేయనున్నారు. ఆపై వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం షర్మిల ప్రసంగించనున్నారు.