breaking news
flight debris
-
ఆ శకలాల కోసం వెళితే.. ఓడ దొరికింది
సిడ్నీ: గల్లంతైన మలేసియా విమానం ఎంహెచ్-370 కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అయితే గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి సముద్రపు అడుగుభాగాన ఓడ శకలాలు కనిపించాయి. కాగా రెండేళ్ల క్రితం గాలింపు చర్యలు ప్రారంభం కాగా ఇలా ఓడ శిధిలాలు కనిపించడం ఇది రెండోసారి. 2014, మార్చి, ఎనిమిదో తేదీన కౌలాలంపూర్ నుంచి బయల్దేరి బీజింగ్ వెళుతుండగా ఈ విమానం గల్లంతైంది. ఆ సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు ఆస్ట్రేలియా నేతృత్వంలోని బృందం దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్న సంగతి విదితమే. -
విమానం ఇంజన్ ఆవాసంగా మారింది
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భాగస్వామ్యం కావడానికి కారణమైన పెర్ల్హార్బర్ దాడి ఘటనలో 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన విమాన శకలం అరుదైన ఫొటో ఇది. నీటిపై ల్యాండ్ అయ్యే కటాలినా పీబీవై-5రకం విమానం ఇంజన్ ప్రస్తుతం ఇలా సముద్రజీవులకు ఆవాసంగా మారింది.