ఆ శకలాల కోసం వెళితే.. ఓడ దొరికింది | Ship debris found in under deep sea water | Sakshi
Sakshi News home page

ఆ శకలాల కోసం వెళితే.. ఓడ దొరికింది

Jan 14 2016 9:59 AM | Updated on Sep 3 2017 3:41 PM

ఆ శకలాల కోసం వెళితే.. ఓడ దొరికింది

ఆ శకలాల కోసం వెళితే.. ఓడ దొరికింది

గల్లంతైన మలేసియా విమానం ఎంహెచ్-370 కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు

 సిడ్నీ: గల్లంతైన మలేసియా విమానం ఎంహెచ్-370 కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అయితే గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి సముద్రపు అడుగుభాగాన ఓడ శకలాలు కనిపించాయి. కాగా రెండేళ్ల క్రితం గాలింపు చర్యలు ప్రారంభం కాగా ఇలా ఓడ శిధిలాలు కనిపించడం ఇది రెండోసారి.

2014, మార్చి, ఎనిమిదో తేదీన కౌలాలంపూర్ నుంచి బయల్దేరి బీజింగ్ వెళుతుండగా ఈ విమానం గల్లంతైంది. ఆ సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు ఆస్ట్రేలియా నేతృత్వంలోని బృందం దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్న సంగతి విదితమే.  

 

Advertisement

పోల్

Advertisement