breaking news
fish sales
-
చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..
డెహ్రాడూన్: ఇటీవల కాలంలో చాలా చిన్న చిన్న విషయాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో చేపలు ఉచితంగా ఇవ్వలేదని ఒక వ్యక్తిపై పైశాచికంగా దాడి చేసి హత్యకు కారణమయ్యారు కొందరు దుండగులు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) అసలు విషయంలోకెళ్లితే...ఉత్తరాఖండ్‌లో నైనిటాల్ జిల్లాలోని టోక్ నర్టోలా గ్రామంలో భగవాన్ సింగ్ పడియార్ చేపలు అమ్మేవాడు. అయితే రాత్రి 7 గంటల ప్రాంతంలో నలుగురు స్థానికులు చేపల కొనుగోలు చేయడం కోసం అతని దుకాణానికి వచ్చారు. అయితే వారు చేపలను ఉచితంగా ఇమ్మంటూ గొడవ చేశారు. అందుకు చేపలమ్మే వ్యక్తి అంగీకరించకపోవడంతో ఆ నలుగురు వ్యక్తులు భగవాన్‌పై కిరాతకంగా దాడి చేసి స్టీల్ రాడ్‌తో అతని కళ్లను కోశారు. ఆ తర్వాత అతన్ని రెండంతస్తుల ఇంటి పైకప్పు పైకి లాగి కిందకు తోసేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు స్థానికులు భగవాన్ను చికిత్స నిమిత్తం హల్ద్వానీలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కానీ భగవానం ఆసుపత్రిలో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడతూ చివరికి మరణించాడు. ఆ తర్వాత బాధితుడి మేనమామ గణేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తదనంతరం పోలీసులు నిందుతులు శల్ సింగ్, సునీల్ జోషి, భూపాల్ సింగ్, చంచల్ సింగ్‌లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇదే తరహాలో మహారాష్ట్రలో నాగాపూర్‌లోని రెస్టారెంట్లో చికెన్ సరిగా వడ్డించలేదంటూ గొడవ చేసి రెస్టారెంట్‌కి నిప్పంటించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) -
చేపల విక్రయం @ రూ. కోటి
రూ.650 ధర పలికిన కొర్రమీను రేట్లు పెంచిన చేపల కట్టర్స్ ఆదివారం కావడంతో భారీగా విక్రయాలు కిక్కిరిసిన ముషీరాబాద్ చే పల మార్కెట్ భోలక్‌పూర్, న్యూస్‌లైన్ : మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కొర్రమీను ధర చుక్కలనంటింది. కిలో కొర్రమీను ధర ఏకంగా 650 పలికింది. మిగతా చేపల ధరలూ రెండు రెట్లు పెరిగాయి. మొత్తంగా ఈ ఒక్కరోజే 30 టన్నుల చేపల విక్రయాలు జరిగాయి. రూ. కోటికి పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. నగరంలోకెల్లా పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడింది. శనివారం అర్ధరాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీసీఎం, లారీల్లో చేపలను దిగుమతి చేసుకున్నారు. గత ఏడాది శనివారం కావడంతో మాంసాహారులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి మాంసప్రియులకు ఇష్టమైన ఆదివారం రోజున మృగశిర కార్తె రావడంతో ఎప్పుడూ లేనంతగా జనాలు కనబడ్డారు. దీంతో చేపల మార్కెట్ నుంచి రాంనగర్ వైపు అరకిలోమీటరు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండెక్కిన కొర్రమీను ఆదివారం ముషీరాబాద్ చేపల మార్కెట్లో కొర్రమీను ధర సామాన్య రోజులతో పోల్చితే రెండింతలు పెరిగింది. కిలోకు రూ.600 నుంచి రూ.650 వరకు కొర్రమీను చేపలు అమ్ముడుపోయాయి. రవ్వలు కిలోకు రూ.110 ధర పలుకగా, బొచ్చలు రూ.100 ధరకు అమ్ముడు పోయాయి. టైగర్ రొయ్యలు కిలో.రూ.300 నుంచి రూ.350 వరకు ధర పలికాయి. బంగారుతీగ రూ.110, మర్తగుంజ చేపలు రూ.210 చొప్పున అమ్ముడయ్యాయి. వీటితో పాటు పీతలు, రొయ్యలు, సీ ఫిష్‌లను విక్రయదారులు అధికంగా కొనుగోలు చేశారు. 30 టన్నుల చేపలు దిగుమతి ముషీరాబాద్ చేపలమార్కెట్లో ఆదివారం ఒక్కరోజే రూ.కోటికిపైగా వ్యాపారం జరిగిందని నగర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు జి.ప్రసాద్ న్యూస్‌లైన్‌కి తెలిపారు. 30 టన్నుల చేపలు దిగుమతి అయ్యాయని, గతేడాది కంటే ఈసారి ఎక్కువ అమ్మకాలు జరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక చేపల్ని ముక్కలుగా కత్తిరించే వారికీ డిమాండ్ పెరిగింది. దీంతో ఒక్కసారిగా రేట్లు పెంచారు. సాధారణ రోజుల్లో చేపలను కట్ చేసి ఇవ్వడానికి రూ.10లు తీసుకుంటే, ఆదివారం మాత్రం కిలోకు రూ.20ల చొప్పున తీసుకున్నారు. ఆదివారం జరిగిన చేపల విక్రయాలతో వాటి వ్యర్ధాలు, మురుగునీరు మార్కెట్ నుంచి రాంనగర్ వైపు వెళ్లే దారిలో శాస్త్రినగర్ వరకు రోడ్డుపై పారాయి.