breaking news
first female judge
-
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ ఇక లేరు
Justice Fatima Bibi Passed Away సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ (96) ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా మె గురువారం కేరళలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫాతిమా బీవీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సంతాపం తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలిపారు. ఆదర్శప్రాయమైన తీర్పులు ఇస్తూ న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలువురి ప్రశంసలందుకున్నారు. ఫాతిమా బీబీ జీవిత విశేషాలు ఫాతిమా బీవీ 1927 ఏప్రిల్ 30న జన్మించారు. ఖడేజా బీవీ అన్నవీటిల్ మీరా సాహిబ్లకు పెద్ద సంతానం. న్యాయశాస్త్రంలో విద్యను అభ్యసించిన అతి చిన్నవయస్కురాలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో బంగారు పతకం సాధించిన తొలి మహిళ. ఫాతిమా బీవీ 1950లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. కేరళ న్యాయమూర్తిగా ఎంపిక 1989 అక్బోబర్ 5వ తేదీన భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా ఫాతిమా భారత న్యాయవ్యవస్థ చరిత్రలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ మనదేశంలో అత్యున్నత స్థానం పొందిన తొలి ముస్లిం మహిళ కూడా. అలాగే తమిళనాడు గవర్నరు గా కూడా పనిచేశారు పదవీ విరమణ అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్ పర్సన్‌గా ఎంపిక ఇన్ కమ్ ట్యాక్స్ అప్పిల్లేట్ ట్రైబ్యునలర్ లో జ్యుడిషియల్ మెంబర్ గానూ వ్యవహరించారు. భారత్ జ్యోతి అవార్డు, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు మహిళల న్యాయం, సమానత్వం పాటుపడ్డారు. -
తొలి మహిళా సీజే కన్నుమూత
న్యూఢిల్లీ: భారత్‌లో ఒక హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ లీలాసేథ్(86) కన్నుమూశారు. ఆమె నోయిడాలోని తన నివాసంలో ఉండగా శుక్రవారం రాత్రి గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తన అవయవాలను దానం చేస్తానని లీలా చనిపోయే ముందు వాగ్దానం చేయడంతో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించమని తెలిపారు. లీలా లండన్ బార్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించిన తొలి భారత మహిళగా నిలిచారు. ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నిర్భయ ఉదంతం తరువాత, లైంగిక నేరాలకు పాల్పడే వారిపై విచారణ త్వరగా పూర్తయ్యేలా న్యాయ శాస్త్రంలో సవరణల్ని సిఫార్సు చేయడానికి నియమించిన జస్టిస్ వర్మ కమిటీలో లీలా కూడా సభ్యురాలు. తన స్వీయ చరిత్ర ‘ఆన్ బ్యాలెన్స్’ బాగా అమ్ముడుపోయిన పుస్తకంగా నిలిచింది. లీలా సేథ్ కుమారుడు విక్రమ్ సేథ్ రచయితే. ఆమె మృతి పట్ల ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.