Fide Womens Grand Prix tournament
-
కోనేరు హంపికి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్ గెలిచిన హంపీ.. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు ఆడికాగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో.. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పుణె వేదికగా బుధవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి, చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్‌తో కలిసి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.అయితే, ఈ టోర్నమెంట్లో నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారైంది. మరోవైపు.. నల్ల పావులతో తక్కువ గేమ్‌లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. పది మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. Congratulations @Humpy_Koneru On winning the FIDE Women’s Grand Prix title! Another glorious feather in your cap. Your brilliance continues to make India proud. A true inspiration to countless young minds, especially aspiring women in sports. #Chess #GrandPrix— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2025 -
టైటిల్‌కు చేరువలో హారిక
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ చెంగ్డూ (చైనా): కెరీర్లో తొలి గ్రాండ్‌ప్రి సిరీస్ టైటిల్ సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరింత చేరువైంది. చైనాలో జరుగుతున్న ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో పదో రౌండ్ ముగిశాక హారిక 6.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపి, ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా) 6 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. జావో జుయ్ (చైనా)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను హారిక 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌లో హంపి నల్లపావులతో ఆడుతూ 37 ఎత్తుల్లో సంచలన విజయం సాధించింది. గురువారం జరిగే చివరిదైన 11వ రౌండ్ గేముల్లో గిర్యా ఓల్గా (రష్యా)తో హారిక... స్టెఫనోవాతో హంపి తలపడతారు. గిర్యా ఓల్గాపై హారిక గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. హంపి, స్టెఫనోవా మధ్య గేమ్ ‘డ్రా’గా ముగిస్తే... హారిక కూడా తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే ఆమెకే టైటిల్ లభిస్తుంది. ఒకవేళ హంపి లేదా స్టెఫనోవాలలో ఒకరు గెలిచి, హారిక గేమ్ కూడా ‘డ్రా’ అయితే ఇద్దరు ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తారు. అపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. హరికృష్ణకు మరో ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో పెంటేల హరికృష్ణ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. పీటర్ లెకో (హంగేరి)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.