breaking news
Female security
-
మహిళా సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ప్రియుడు..
అన్నానగర్: చెన్నై పక్కనే ఉన్న మామల్లపురంలో బుధవారం వివాహేతర ప్రియుడితో లాడ్జికి వెళ్లిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పక్కన చిత్రవాడి గ్రామానికి చెందిన జయరాజ్(28)కు భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. మేళవలంపేటలోని ఓ పురుగు మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పౌన్సూరులో నివాసముంటున్న సంగీత(32)కు 17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాట్టంకొళత్తూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సంగీత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. ఉద్యోగానికి వెళుతున్న సమయంలో సంగీతకు జయరాజుతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం సంగీత భర్తకు తెలియడంతో ఆమెను ఖండించాడు. ఐదేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టిన సంగీత గూడువాంచేరిలోని తన తల్లి ఇంట్లో ఉంటూ జయరాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తుంది. బుధవారం సంగీత బైకులో జయరాజుతో కలిసి మామల్లపురం వెళ్లింది. వీరిద్దరూ అక్కడే ఒత్తవాడై వీధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. అప్పుడు జయరాజ్ సంగీతను ఇంత మందితో సెల్ ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆహారం కొనుక్కోవడానికి జయరాజ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సంగీత ఉరి వేసుకుని చనిపోయి ఉండడాన్ని చూసి షాక్‌కు గురైన జయరాజ్ ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. దీనిపై మామల్లపురం డిప్యూటీ సూపరింటెండెంట్ రవి అభిరామ్, మామల్లపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంగీత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయరాజ్‌ను పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో సంగీతను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. తనతోపాటు వచ్చిన జయరాజ్‌ను పోలీసులు విచారించగా.. పలువురితో సన్నిహితంగా ఉండడంతోనే సంగీతను గొంతు నులిమి హత్య చేశానని తెలిపాడు. తర్వాత ఏం చేయాలో తెలియక హత్యను కప్పిపుచ్చాలని సంగీత దుపట్టా చించి ఆమె శరీరాన్ని విద్యుత్ ఫ్యాన్‌కి వేలాడదీశానని తెలిపాడు. అప్పుడు సంగీత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని డ్రామా ఆడినట్టు ఒప్పుకున్నాడు. కానీ సంగీత గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ విషయాన్ని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన జయరాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
ఈ నవ్వులు ఇక లేవు
ఈ చిరునవ్వులను ఓ ఉన్మాది చిదిమేశాడు. ఇంటి దీపాలను ఆర్పేశాడు. తన ను ప్రేమించలేదనే అక్కసుతో... మృగంగా మారిన యువకుడు... తాను మనసు పడిన అమ్మాయితో పాటు ఆమె సోదరినీ పొట్టన పెట్టుకున్నాడు. కొత్తపేటలోని గాయత్రీపురం రోడ్ నెం-1లో మంగళవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన నగరంలో కలకలం సృష్టించింది. - ప్రేమోన్మాది దాడిలో అక్కాచెల్లెళ్ల మృతి ఉలిక్కిపడిన నగరం - ఆగని హత్యోదంతాలు ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకం సాక్షి, సిటీబ్యూరో/భాగ్యనగర్ కాలనీ/ముషీరాబాద్: మహా నగరంలో ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. అబలలపై దాడులకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మొన్న కూకట్పల్లి... నిన్న చాంద్రాయణగుట్ట... నేడు కొత్తపేట... ఇలా మృగాళ్ల పైశాచికత్వానికి అమాయక ఆడపిల్లలు గాయపడడమో...ప్రాణాలు కోల్పోవడమో పరిపాటిగా మారింది. ఈ ఘటనలు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా మరో ఉన్మాది అమాయక యువతిపై పగబట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగిన అక్కాచెల్లెళ్లను కిరాతకంగా హతమార్చాడు. గొప్ప చదువులు చదువుకొని... జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించిన వారి కలలను కాలరాశాడు. కొత్తపేట గాయత్రీపురం రోడ్ నెం-1లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిలను అమిత్ అనే ఉన్మాది అంతమొందించాడు. కొద్ది నెలల వ్యవధిలో నగరంలో చోటుచేసుకున్న దుర్ఘటనలు భీతిగొల్పుతున్నాయి. మానని గాయం... అది 2014 అక్టోబర్ 13వ తేదీ. ఎప్పటిలాగానే రవళి బండ్లగూడలోని అరోరా కళాశాలకు బయలుదేరింది. బస్సు దిగి లోనికి ప్రవేశిస్తుండగానే... మానవ రూపంలో ఉన్న మృగం దాడి చేసింది. తనను ప్రేమించాలని కొంతకాలంగా వెంటపడుతున్న ప్రేమోన్మాది కాలేజీ బ్యాగ్‌లో కత్తిని పెట్టుకొని వచ్చి అందరూ చూస్తుండగానే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రవళి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కానీ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఆమెపై దాడి చేసిన ప్రేమోన్మాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గాయం నుంచి నెమ్మదిగా బయటపడిన రవళి అదే కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ‘ఆ సంఘటన తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రిటైర్డు బ్యాంకు ఉద్యోగి అయిన మా నాన్న గోపిదేవ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు రాంనగర్ చౌరస్తా వరకు వచ్చి బస్సెక్కిస్తారు. సాయంత్రం తిరిగి తీసుకెళ్తారు. ఆ దాడిని ఇంట్లో ఎవ్వరమూ మరచిపోలేకపోతున్నాం’ అంటూ రవళి గద్గద స్వరంతో చెప్పింది. ‘ఇటువంటి సంఘటన ఏ తల్లిదండ్రులకూ ఎదురు కాకుడదు... పెళ్లయ్యే వరకూ పిల్లలను మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ ప్రభుత్వమూ, ఏ షీ టీమ్‌లూ రక్షణ కల్పించలేవని’ రవళి తండ్రి గోపిదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. బిడ్డలను కాపాడుకున్న వల్లభరావు... పెళ్లికి నిరాకరించిందన్న కసితో ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ తెల్లవారు జామున 5.30 గంటలకు కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఓ యువతిపై మరో ప్రేమోన్మాది దాడికి దిగాడు. తూర్పు గోదావరి జిల్లా ఎర్రపాలెంకు చెందిన వల్లభరావుకు ముగ్గురు కూతుళ్లు. మూడో కుమార్తె నీరజ కష్ణవేణిని చేవెళ్ల బ్రాహ్మణ కాలనీకి చెందిన నేదరి మల్లేష్ అలియాస్ రాజు అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించి చివరకు కత్తితో దాడి చే శాడు. ఆమె తిరస్కరణను సహించలేక హతమార్చేందుకు సిద్ధపడ్డాడు. తల్లి తులసమ్మ, సోదరుడైన దుర్గా గంగాధర్లపైన దాడికి దిగాడు. యువతి తండ్రి వల్లభరావు ఆ సమయంలో బయటి నుంచి ఇంటికి రావడం... నిందితుడిపై ప్రతి దాడికి దిగడంతో వారు బతికి బయటపడ్డారు. లేకపోతే ఆ యువతితో పాటు, తల్లి, సోదరుడు బలయ్యేవారే. వల్లభరావు చేతిలో గాయపడ్డ ఉన్మాది అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్భయ చట్టాన్ని అమలు చేయండి చైతన్యపురి: నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని ఎన్ఎస్యూఐ నాయకులు సాయిగౌడ్, ప్రవీణ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యామిని, శ్రీలేఖ హత్యలకు నిరసనగా మంగళవారం చైతన్యపురిలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్రేమోన్మాది అమిత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరం నడిబొడ్డున యువతులను ప్రేమోన్మాది హతమార్చినా హోం మంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బీజేవైఎం ఆధ్వర్యంలో... ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో చైతన్యపురి నుంచి కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్గం యశ్పాల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు, యువతులక రక్షణ కరవ వుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, కిరణ్, తరుణ్, భరత్, యాదగిరి, శివ, శ్రీకాంత్, నవీన్, నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ఈ హత్యాకాండ ఆగడం లేదు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న అక్కాచెల్లెళ్లను నిందితుడు దారుణంగా హతమార్చాడు. ఆ హంతకుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. చిన్నారులను సైతం ఈ మృగాళ్లు వదిలిపెట్టడం లేదు. రెండు, మూడేళ్ల పసిపిల్లలు మొదలు వయస్సు పైబడిన మహిళల వరకూ ఇలాంటి మృగాళ్ల లైంగిక దాడులకు, హింసకు బలవుతూనే ఉన్నారు. ఇటువంటి దుర్మార్గుల పీచమణిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. షీ టీమ్స్ ఉన్నాయి. శిక్షలు కఠినంగా ఉంటే తప్ప మృగాళ్లలో మార్పు రాదనిపిస్తోంది. - కొమ్ము ఉమాదేవి యాదవ్, టీఆర్ఎస్ మహిళా విభాగం చిన్నప్పటి నుంచే విలువలు నేర్పాలి చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక విలువలు నేర్పించకపోతే ఇలాంటి మృగాళ్లే తయారవుతారు. సహజంగా మనిషి ఆలోచనా జీవి. కానీ ఆ ఆలోచన విస్మరించడం వల్లనే మృగాడుగా మారుతున్నాడు. ఈ ఆలోచన కోల్పోవడానికి తల్లిదండ్రులు, కుటుంబం మాత్రమే బాధ్యులు కారు. అలాగని పోలీసులు, స్కూళ్లు, కాలేజీలనూ బాధ్యులను చేయడం సరికాదు. మొత్తం సమాజంలోనే మార్పు రావాలి. - లలిత దాస్, మానసిక నిపుణురాలు