breaking news
Female cricketers
-
శ్రీచరణిపై బాబు సర్కార్ చిన్నచూపు
సాక్షి, అమరావతి: క్రీడాకారులలో ఉన్న ప్రతిభను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించలేదు. భారతదేశ సత్తాను చాటిచెప్పిన మహిళా క్రీడాకరిణిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వివిధ రాష్ట్రాలు.. క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో గౌరవిస్తున్నాయి. ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం కరువైంది.క్రీడాకారిణి రేణుక సింగ్ ఠాకూర్‌కి కోటి రూపాయలు ప్రోత్సాహకం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన క్రాంతిగౌడ్కి కోటి రూపాయలు ప్రోత్సాహకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ తరపున శ్రీచరణి ప్రతిభను గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత మహిళా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్‌లకు రూ.11 లక్షలు రూపాయలు చొప్పున పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహకం ప్రకటించింది.శ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదు?: సతీష్రెడ్డిశ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ముంబైలో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చూడ్డానికి నారా లోకేశ్ వెళ్లివచ్చాడు. వారితో గతంలో నారా లోకేశ్ మాట్లాడిన ఫొటోలు, వీడియోలు ముందుపెట్టి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వరల్డ్ కప్ గెలిచారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే నిజమైతే కడప బిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డికి ఎందుకు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు?’’ అని సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘గతంలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పీవీ సింధు, హారిక, పుల్లెల గోపీచంద్ వంటి వారికి ఇళ్ల స్థలాలు, నగదు ప్రోత్సాహాలతో సత్కరించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీచరణిని ఎందుకు అభినందించలేకపోతున్నారో చెప్పాలి. వారందరికీ ఒక న్యాయం, శ్రీచరణికి ఒక న్యాయమా? దేశంలోని ఇతర రాష్ట్రాలు తమ క్రీడాకారులను సత్కరిస్తుంటే శ్రీచరణిని కనీసం అభినందించడానికి చంద్రబాబుకి మాత్రం మనసు కలగడం లేదు’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
కివీస్ క్రికెట్లో ‘సమ’శకం.. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
క్రైస్ట్‌చర్చ్: ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్‌జెడ్‌సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌కే పరిమితం చేయకుండా ఎన్‌జెడ్‌సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టడం నిజంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే! ఇప్పుడు కివీస్ స్టార్లు విలియమ్సన్ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది. శాసించే చోట సమానత్వం అంతర్జాతీయ క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్. అది ప్రపంచకప్ అయినా... యాషెస్ సిరీస్ అయినా... ఆసియా కప్ అయినా పురుషాధిక్యమే మైదానంలో మెరుపుల్ని మెరిపిస్తుంది. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లను జమచేసుకుంటుంది. ఇలా శాసించే చోట సమానత్వం కొత్త ఒరవడే కాదు... ఆ బోర్డు చేసే సాహసమే! పురుషుల సిరీస్‌లకు వచ్చేంత రాబడి మహిళల ప్రపంచకప్‌కు రాదు. అయినప్పటికీ న్యూజిలాండ్ సమాన చెల్లింపుల విధానంతో ఏకంగా ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అనేది క్రికెట్లో పెద్ద సంచలనం. ఎన్‌జెడ్‌సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్‌కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. -
మహిళా క్రికెటర్లకు రైల్వే శాఖ ప్రమోషన్లు
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచకప్ క్రికెట్లో అత్యద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లకు రైల్వే శాఖ నేరుగా పదోన్నతి కల్పించనుంది. ప్రస్తుతం జట్టులోని 15 మంది క్రీడాకారిణులలో 10 మంది రైల్వే ఉద్యోగులే ఉండటం విశేషం. ఇందులో కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్, ఏక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మేష్రమ్, రాజేశ్వరి, నుజ్హత్ పర్వీన్ ఉన్నారు. ‘భారత జట్టుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మా పాలసీ ప్రకారం వారికి నజరానా కూడా ఇవ్వనున్నాం’ అని రైల్వే క్రీడాభివృద్ధి కార్యదర్శి రేఖా యాదవ్ తెలిపారు. మరోవైపు హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్ ప్రభుత్వం రూ. 5 లక్షల నజరానా ప్రకటించడంతోపాటు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేసింది.


