Feel Good Movie: ‘మమ్మా మియా’ సాంగ్ రిలీజ్
సుచిత్, అదితి త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫీల్ గుడ్’. దయానంద్ దర్శకత్వం వహించగా, విశ్వరూప ఫిల్మ్స్ బ్యానర్‌పై సుచిత్ నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘మమ్మా మియా’ పాటను రిలీజ్చేశారు. ‘వైబ్’, ‘సింక్’, ‘ట్రెండ్’, ‘హైప్’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. లవ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు. శాండిల్య పిసపాటి అందించిన మ్యూజిక్, కడలి సత్యనారాయణ సాహిత్యం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి పాడిన ఈ పాట నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఫీల్ గుడ్‌గా రూపొందింది. మ్యూజిక్ లవర్స్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.