breaking news
F-1 format
-
అమెరికా వీసాల్లో భారతీయులకు భారీ షాక్
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు 2025లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది అడ్మిషన్ సీజన్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F-1 స్టూడెంట్ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 62 శాతం మేర తగ్గింది. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు కూడా వీసాల సంఖ్య తగ్గినప్పటికీ, భారతీయులతో పోలిస్తే ఆ తగ్గుదల చాలా తక్కువగా నమోదైంది.అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (CIS) విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం.. 2025 మే నుంచి ఆగస్టు మధ్య భారతీయులకు కేవలం 22,149 స్టూడెంట్ వీసాలు(F-1) మాత్రమే జారీ అయ్యాయి. ఇక, 2024లో 58,694 వీసాలు జారీ కాగా, ఈసారి దాదాపు 62 శాతం తగ్గుదల నమోదైంది. చైనా విద్యార్థుల విషయంలో 2024లో 61,075 వీసాలు జారీ కాగా, 2025లో ఆ సంఖ్య 40,034కు పడిపోయింది. అక్కడ తగ్గుదల 34 శాతం మాత్రమే నమోదైంది.ప్రతి ఏడాది మే నుంచి ఆగస్టు వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతుండటంతో ఈ కాలంలోనే అత్యధికంగా స్టూడెంట్ వీసాలు జారీ అవుతాయి. అందువల్ల ఈ నాలుగు నెలల గణాంకాలను అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై కీలక సూచికగా పరిగణిస్తారు. వీసాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) గణాంకాల ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికా విద్యాసంస్థల్లో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, చైనా నుంచి 2,65,919 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 11.7 లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో ఈ రెండు దేశాల విద్యార్థులే సగానికి పైగా ఉన్నారు.2020 కరోనా మహమ్మారి కాలాన్ని మినహాయిస్తే, 2017–19 మరియు 2021–24 మధ్య మే-ఆగస్టు కాలంలో భారతీయులకు సగటున 55,717 F-1 వీసాలు జారీ అయ్యాయి. ఆ సగటుతో పోల్చినా 2025లో నమోదైన 22,149 వీసాల సంఖ్య దాదాపు 60 శాతం తక్కువగా ఉందని CIS పేర్కొంది. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమంలో కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో OPT కింద పనిచేస్తున్న మొత్తం 2,94,253 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లలో 1,43,740 మంది భారతీయులు ఉండగా, చైనా నుంచి 61,981 మంది ఉన్నారు.F-1 వీసా అంటే?F-1 వీసా అనేది అమెరికాలోని గుర్తింపు పొందిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భాషా శిక్షణా సంస్థలు లేదా ఇతర విద్యాసంస్థల్లో పూర్తికాలం (Full-time) చదువుకోవడానికి విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం జారీ చేసే విద్యార్థి (Student) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.60 రోజుల నుంచి 30 రోజులకు...ఇదిలా ఉండగా.. CIS విశ్లేషణ ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం F-1 వీసాదారులకు ఇప్పటి వరకు అమలులో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానాన్ని మార్చి నిర్దిష్ట కాలపరిమితితో వీసా మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉండగా, కోర్సు ఎక్కువ కాలం కొనసాగితే అదనపు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. కళాశాల లేదా కోర్సు మార్చుకునే నిబంధనలను కూడా మరింత కఠినతరం చేశారు. అయితే, వీసాల జారీ తగ్గుదలకు కేవలం కొత్త విధానాలే కారణమని నిర్ధారించలేమని నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తుల సంఖ్య, వీసా అపాయింట్మెంట్ల లభ్యత, పరిపాలనా ప్రక్రియలు వంటి ఇతర అంశాలు కూడా ఈ తగ్గుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘బంగారు తల్లి’కి ఆదరణ
కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఆడపిల్లల సంరక్షణార్థం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం ఫలాలు పొందడంలో రాష్ట్రంలోనే పాలమూరు ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లావాసులు ఎక్కువమంది ఈ పథకం ద్వారా ప్రయెజనాలను పొందారు. బంగారు తల్లి కింద లబ్ధిపొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,15,741 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91,666 మంది అర్హత సాధించగా చిన్నారుల ఖాతాల్లో రూ 15.86 కోట్లు జమఅయ్యాయి. మన జిల్లాలోని 64 మండలాల్లో 10,047 మంది చిన్నారుల కోసం దరఖాస్తులు రాగా రూ. 1.39లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలో అత్యధికంగా బంగారుతల్లి ఫలాల కోసం 282 దరఖాస్తు చేసుకోగా, 268 మంది అర్హత సాధించడంలో బిజినేపల్లి మం డలం అగ్రస్థానంలో నిలిచింది. అయితే జిల్లాలోనే అత్యధికంగా నవాబ్‌పేట మం డలానికి చెందిన 169 మంది చిన్నారుల కోసం రూ.4,22,500 మంజూరైంది.కల్వకుర్తి నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన 786 మంది దరఖాస్తు చేసుకోగా రూ.13,80,000 ఆయా బ్యాంకు ఖాతాల్లో జమఅయ్యాయి. కల్వకుర్తి మండలంలో ఇప్పటికే 16 మంది చిన్నారుల ఖాతాల్లో డబ్బులు జమఅయ్యా యి. 109 మంది ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు. మండలానికి మొత్తం రూ. 2,72,500 మంజూరైంది. ఆమనగల్లు మండలంలో 109 మంది ఇప్పటికే డబ్బు లు తీసుకున్నారు. మండ లానికి మొత్తం రూ.2,72,500 మంజూరైంది. మాడ్గుల మండలంలో 153 మంది డబ్బు తీసుకున్నారు. ఈ మండలానికి నియోజకవర్గం లో నే అత్యధికంగా రూ.3,82,500 మం జూరైంది. వెల్దండ మండలంలో 113 మంది ఇప్పటికే డ బ్బు తీసుకున్నారు. ఈ మండలానికి రూ. 2,82,500 మంజూరయ్యాయి. తలకొండపల్లి మండలానికి రూ.1.70 లక్షలు మంజూరయ్యా యి. 68 మంది ఇప్పటికే డబ్బు తీసుకున్నారు. పథకం అమలు తీరు ఇలా.. తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో 2013 మే 1వ తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు బంగారు పథకం వర్తిస్తుంది. ఒక కుంటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ముందుగా గ్రామంలో గర్భిణుల జాబితాను గ్రామసంఘం ఎఫ్-1 ఫార్మాట్లో తయారుచేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునిచే జాబితాను ధ్రువీకరించుకోవాలి. పేరు నమోదుకాగానే బ్యాంకుఖాతా తీసుకోవాలి. ఆడపిల్ల పుట్టగానే చిన్నారికి ‘బంగారు తల్లి’ అని పేరుపెట్టాలి. గ్రామ పంచాయతీ లేక మునిసిపాలిటీలో జనన ధ్రువీకరణపత్రం పొం దాలి. పాప జన్మించగానే ఎఫ్-2 ఫార్మాట్లో నమోదు చే యడానికి అవసరమైన జనన ధ్రువీకరణపత్రం, రేషన్, ఆధార్‌కార్డులు, తల్లీబిడ్డల ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ సమర్పించారు. ఆ తరువాత అధికారి ధ్రువీకరణ పొంది రూ.2,500 మనం సూచిం చిన ఖాతాలో నేరుగా జమఅవుతాయి. చిన్నారికి ఏడేళ్లు నిండగానే ఆధార్ కార్డును పొంది ఆ నెంబర్‌ను డాటాబేస్‌లో పొందుపర్చాలి. అదే ఏడాది పాప పేరును తల్లి పేరుతో జతపర్చి జాయింట్ ఖాతాగా మార్చాల్సి ఉం టుంది. ఆ తరువాత ఆడపిల్ల పుట్టగానే రూ 2,500, మొదటి, రెండో ఏడాది వెయ్యి చొ ప్పు న, 3,4,5 ఏళ్లలో చిన్నారి అంగన్వాడీ కేం ద్రా ల్లో చేరిన తరువాత రూ 1500 చొప్పున, ఆరు నుంచి 10 ఏళ్లవరకు 5వ తరగతి పూర్తి చేసే నా టికి ఏడాదికి రెండువేల చొప్పున, 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7,8 తరగతులు పూర్తి చే సిన బాలికకు ఏడాదికి రూ 2500, దీంతో పాటు 9, 10వ తరగతులు పూర్తిచేసి, 14 నుంచి 15 బాలికకు ఏడాదికి మూడువేల చొప్పున, 16,17 ఏళ్లు నిండి ఇంటర్ పూర్తయ్యే వరకు రెండేళ్ల పాటు రూ 3,500 చొప్పున మంజూరవుతాయి. ఆ తరువాత 18 నుంచి 21 ఏళ్లు ఉండి డిగ్రీ పూర్తిచేస్తే ఏడాదికి నాలుగువేల చొప్పన 21 ఏళ్లు నిండగానే ఇంటర్ పూర్తయిన వారికి రూ 50 వేలు, డిగ్రీ పూర్తయిన వారికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రచారం లోపం.. లబ్ధిదారులకు శాపం అయితే బంగారు తల్లి పథకం ద్వారా ఫలాలు పొందేందుకు అర్హులైనప్పటికీ పథకంపై ఇప్పటికీ గ్రామీణ ప్రాంతప్రజల్లో అవగాహన కల్పించేవారు కరువయ్యారు. దీంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కావాల్సిన అర్హతలు తెలియక తికమక పడుతున్నారు. బంగారుతల్లి పథకంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.


