breaking news
Expulsion of the village
-
మూడు కుటుంబాల వెలి
పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో మూడు కుటుంబాలపై వెలి వేసిన (సాంఘిక బహిష్కరణ) ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో ముస్లిం (దూదేకుల) సామాజిక వర్గానికి చెందిన 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గడచిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచాయి. కుల కట్టుబాటు ప్రకారం.. టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆ కుల పెద్దలు ఆ మూడు కుటుంబాల వారికి చెప్పారు. అయితే, ఆ మూడు కుటుంబాలు వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేయడంతో ఎన్నికల నాటినుంచీ వారిని టీడీపీ నేతల ప్రోద్బలంతో సాంఘికంగా బహిష్కరించి.. మిగిలిన కుటుంబాలన్నీ వేరుగా చూస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలు ఆదివారం పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, సీఐ వీరాస్వామి, తహసీల్దార్ క్షమారాణి సోమవారం రాత్రి గ్రామంలో ఆ సామాజిక వర్గం వారితో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేదని, శాంతియుతంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా.. ఆ మూడు కుటుంబాలు క్షమాపణ చెబితేనే కలిసి ఉంటామని కుల పెద్దలు చెప్పగా.. అందుకు ఆ మూడు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలతో మాట్లాడినా ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. -
రూ. లక్షల్లో జరిమానాలు.. మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు..
జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల ఆగడాలు రోజు రోజుకూ శృతి మింపోతున్నాయి. సమాజం ఒకవైపు సాంకేతికంగా పరుగులు పెడుతుంటే మరో వైపు వీడీసీల పనితీరు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. గ్రామాభివృద్ధికి ఏర్పడిన కమిటీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. కానీ ఇవి గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు మాట వినకుంటే బహిష్కరణ పంచాయతీ తీర్పుల్లో రూ. లక్షల్లో జరిమానాలు రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్న అధికారులు ఖలీల్‌వాడి: గ్రామాల్లో చిన్న, పెద్ద పంచాయతీలు వీడీసీ వద్దకు చేరితే మాట వినని వారిని బహిష్కరణ వేటు తప్పదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వీడీసీల్లో తలదూర్చని పరిస్థితి ఉంది. దీంతో పంచాయతీలో వీడీసీలు పెదరాయుళ్లు తీర్పులు ఇస్తారు. చిన్నతప్పు జరిగినా ర. లక్షల్లో జరివనాలు విధిస్తారు. వినకపోతే సాంఘిక బహిష్కరణే. అక్కడ వీరు చెప్పిందే చట్టం చేసిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మర్, బాల్కొండ, నిజామాబాద్ రరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాపు వరకు.. గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం వీడీసీలు కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాప్‌లకు టెండర్లు నిర్వహిస్తారు. గ్రామంలో వేలం పాటను నిర్వహిస్తాయి. కోడిగుడ్డు నుంచి కూల్‌డ్రింక్స్‌ను గ్రామంలో వేలంపాటలో దక్కించుకున్న వారే అమ్మాలి. ఇతరులు అమ్మితే వారికి జరిమనా వేస్తారు. కోడిగుడ్లు, కూల్డింక్స్ను మార్కెట్ రేటు కంటే అదనంగా డబ్బులు అమ్మకాలు చేస్తారు. బెల్ట్‌షాపుల వేలం దక్కించుకున్నవారు దాని రేటు కంటే రూ.10 నుంచి 50 వరకు ధరలను పెంచి అమ్ముతారు. వీడీసీకి ప్రజాప్రతినిధులు దాసోహం.. మంలో వీడీసీ వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులను బహిష్కరించిన ఘటనలు ఉన్నాయి. ఆర్మర్ మండలంలోని పెర్కిట్ వీడీసీ అప్పటి ఆర్మర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను బహిష్కరించారు. వీడీసీలు ఇచ్చిన తీర్పుకు బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లవద్దు, న్యాయస్థానాలు ఆశ్రయించవద్దు. ఇలాంటి అనేక ఆంక్షలు పెట్డడంతో పెత్తనం పెరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు వీడీసీలకు దూరంగా ఉంటేనే తమ పనులను చక్కబెట్టుకుంటారు. వీడీసీ అగడాలను పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. 1970లోనే ఏర్పాటు.. జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలు 1970లో ఏర్పడ్డాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పించుకోవడానికి వీడీసీలు అప్పట్లో ఏర్పడ్డాయి. కుళాయి, బోరు నీటి కోసం, మురికి కాలువలు, రోడ్లు, వీధిదీపాలు పెట్టించటం ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీడీసీలు పనిచేసేవి. వీడీసీలు గ్రామంలో ప్రతి ఇంటికి కొంత డబ్బులు కలెక్ట్ చేసి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించేవారు. కాని రానురానూ అవి పూర్తిగా మారిపోయాయి. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో వీడీసీలో క్యాషియర్ పోస్టు కోసం రెండు గ్రూపులుగా చీలిపోయి. రెండు వర్గాల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతనే ఉన్నాయి. ఈ గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు 8 మంది సభ్యులు, ఇతర కులాలకు చెందిన 10 మంది సభ్యులు వీడీసీలో ఉంటారు. క్యాషియర్ పదవీ విషయంలో విభేదాలు రావడంతో వీడీసీ రెండుగా చీలింది. ఎవరికి వారు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత మండలమైన వేల్పర్లోని రామన్నపేట్లో వీడీసీ ఆగడాలు మితిమీరిపోయాయి. రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేయడంతో పొలాలకు వెళ్లే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రశ్నింనందుకు ఓ కులానికి చెందిన 300 కుటుంబాలను బహిష్కరించారు. వీడీసీ ఆదేశాల మేరకు గ్రామంలో ఈ కులస్తులకు కిరాణ సామానుతో పాటు హోటల్లో టీ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఒక వర్గంపై మరో వర్గం రాళ్లదాడి కూడా చేసుకున్నాయి. రెండు వర్గాలను పిలి అధికారులు, పోలీసు లు సమస్యను పరిష్కరించారు. ఇప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. సిరికొండలోని గడ్కోల్‌లో న్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయగా తగాదా కోర్టుకు చేరింది. కోర్టులో ఓ మహిళ కుటుంబానికి న్యాయస్థానం ఫైన్ వేయగా వారు కట్టేశారు. అయితే కుల సంఘంలోకి సదరు మహిళ కుటుంబం రావాలంటే ఆల్ కమిటీ(వీడీసీ)కి ర. లక్ష చెల్లించాలని తీర్మానించారు. కోర్టుకు వెళ్లి జరివనా కట్టామని మళ్లీ మీకు ఎందుకు కట్టాలని వారు ఆల్ కమిటీ(వీడీసీ)ని ప్రశ్నించారు. దీంతో ఈ కుటుంబాన్ని ఇప్పటివరకు కులసంఫనికి సంబంధించిన ఏ కార్యక్రవన ఏ కార్యక్రమాలకు పిలవట్లేదు. మాట్లాడట్లేదు. వరికి ఆల్‌కమిటీ(వీడీసీ) చేసిన నిర్వాకంపై శుక్రవారం బాధిత కుటుంబం ఏసీపీ కిరణ్‌కుమార్‌ను ఆశ్రయించింది. -
మహిళా సర్పంచ్ గ్రామ బహిష్కరణ
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరినందుకే.. బీద సోదరుల సొంతూరులో దాష్టీకం అల్లూరు, న్యూస్‌లైన్: మత్స్యకార మహిళా సర్పంచ్, ఆమె కుటుంబంపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు. ఈ సంఘటన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, కావలి టీడీపీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుల సొంతూరు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లిలో సోమవారం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన బుచ్చంగారి మమత సర్పంచ్‌గా ఎన్నికైంది. అయితే ఈనెల 2వ తేదీన ఆమె తన భర్త బాబుతో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో కంగుతున్న టీడీపీ నేతలు.. తెర వెనుకనుంచి ఆమె కుటుంబానికి గ్రామ బహిష్కరణ విధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ వర్గానికి చెందిన మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొండూరు పాల్శెట్టి, ఇస్కపల్లి మత్స్యకార గ్రామాల పెద్దకాపులు కలిసి ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. మహిళా సాధికారత తమ హయాంలోనే జరిగిందని గొప్పలు చెప్పుకునే టీడీపీ.. ఆ ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే స్వగ్రామంలో ఇటువంటి దాష్టీకం జరగడం గమనార్హం.