breaking news
exercise CI
-
పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?
స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారుగానీ... నిజానికి మహిళలు తమ రుతు సమయంలో ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాయామాలు చేయవచ్చు. ఆ టైమ్‌లో చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. అయితే మహిళలు తమ రుతు సమయంలో ఒక విషయంలో కొంత అప్రమత్తతతో ఉండాలి. అదేమిటంటే... రుతు సమయంలో వాళ్లు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ మోతాదులు తగ్గే అవకాశం ఉన్నందున... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం చాలా మేలు చేస్తుంది. ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు... మాంసాహారాల్లో వేటవూంసం, చికెన్, చేపలు, లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు (పాలకూర వంటివి), ఎండుఖర్జూరం, గసగసాలు, చిక్కీ వంటి పదార్థాల్లో ఐరన్ మోతాదులు ఎక్కువ. ఇవి కేవలం పీరియడ్స్ సమయంలోనే కాకుండా మామూలు టైమ్‌లోనూ తీసుకుంటుంటే వారిలో ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది.దూరంగా ఉండాల్సిన పదార్థాలివే... రుతు సవుయంలో వారు నువ్వులు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే దేహం కాస్తంత మందకొడిగా మారడంతో వ్యాయామాలు చురుగ్గా చేయలేక΄ోవచ్చు. కేవలం రుతు సమయంలోనే కాకుండా మిగతా టైమ్‌లో కూడా వీటితో చురుకుదనం తగ్గవచ్చు. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పండ్లరసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది. అంతేకాదు... వేళకు పడుకుని, కంటినిండా నిద్రపోవడం వల్ల పూర్తి ఆరోగ్యమూ బాగుంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) మెరుగుపడుతుంది. (చదవండి: పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్‌క్యూ') -
అధికార పార్టీ నేత అరాచకం
కొడవలూరు: అధికార పార్టీ నేతల అరాచకానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఎలాంటి లెసైన్స్ లేకుండానే మద్యం షాపు నిర్వహిస్తుండగా, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన ఘటన మండలంలోని తాటాకులదిన్నెలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది. ఇక్కడ జూన్ ఆఖరి దాకా కూడా స్థానిక అధికార పార్టీ నేత మద్యం దుకాణం నిర్వహించారు. జూలై నుం చి ప్రారంభమైన నూతన మద్యం దుకాణాల్లో ఇక్కడి దుకాణం అధికార పార్టీ నేతకు రాకుండా మరో వ్యక్తికి వచ్చింది. దీంతో ఏవిధంగానైనా ఆ మద్యం దుకాణాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ నేత ఎమ్మెల్యే అండతో అరాచకానికి దిగారు. పంచాయతీ అనుమతి లేదంటూ మద్యం దుకాణ భవనాన్ని కూలదోయించారు. అతడిని ఎదుర్కోలేకపోయిన మద్యం దుకాణదారు కంటైనర్ తెచ్చి అందులో మద్యం దుకాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా వదలని అధికార పార్టీ నేత ఆ దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉంచి అమ్మకాలు ఆరంభించారు. ఈ సమాచారం ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోవడంతో ఎలాంటి అనుమతి లేకుం డా గదిలో మద్యం నిల్వలు ఉండటంతో మద్యంతోసహా ఆ గదిని సీజ్ చేశారు. అయితే ఎక్సైజ్ అధికారులపై ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో సీజ్ చేసిన సరుకును మరలా వదిలేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం. మద్యం నిల్వలు ఉన్నందునే సీజ్ చేశాం: కోటేశ్వరరావు, ఎక్సైజ్ సీఐ తాటాకులదిన్నెలో మద్యం దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉన్నాయని సమాచారం అందడంతో వెళ్లి వాటిని సీజ్ చేశాం. కానీ మద్యం నిల్వలు ఉంచిన వ్యక్తికి మరోచోట మద్యం దుకాణానికి లెసైన్స్ ఉంది. కానీ ఇక్కడ మద్యం నిల్వలు ఉంచడం చట్టవిరుద్ధమైనందున సీజ్ చేశాం. మద్యం నిల్వలను రాత్రికిరాత్రే తీయించాలని ప్రయత్నించాం. కానీ గురువారం దాకా గడువు అడిగినందున ఇచ్చాం.


