breaking news
exchange currency
-
Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. -
బ్యాంకుకు వచ్చిన ప్రధాని మోదీ తల్లి
-
బ్యాంకుకు వచ్చిన ప్రధాని మోదీ తల్లి
గాంధీనగర్: దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాంకులు, పోస్టాపీసుల వద్ద బారులు తీరుతుండగా గుజరాత్ లోని ఓ బ్యాంకు ముందు ఓ పెద్దావిడ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. మీడియా మొత్తం ఒక్కసారిగా ఆమె వైపు తమ కెమెరాలు తిప్పింది. ఆమె ఎవరో కాదు భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరా బెన్. ఆమె మంగళవారం ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ బ్యాంకు వద్దకు తన సహాయకుల సాయంతో చేరుకున్నారు. అనంతరం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లి తన పాత డబ్బును మార్పిడి చేసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లు ఇక చెల్లబోవని ఈ నెల(నవంబర్) 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారి దేశంలోని పలువురు(వీరిలో సామాన్యులే అధికం) బ్యాంకులముందు తమ కనీస అవసరాలకోసం బారులు తీరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.