breaking news
evv sathyanarayana
-
చిరు-నాగ్‌తో మల్టీస్టారర్.. ఇలా మిస్ అయింది!
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి( Chiranjeevi,), నాగార్జున(Nagarjuna) ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పండుగ సమయంలో లేదా ఏదైనా శుభకార్యం జరిగితే ఫ్యామిలీతో కలిసి హాజరవుతుంటారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యాపార పరంగానూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అంతా క్లోజ్‌గా ఉండే ఈ ఇద్దరు..ఇప్పటి వరకు కలిసి నటించకపోవడం గమనార్హం. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుటుందని అటు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ఇటు మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.అయితే గతంలోనే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో అది ఆగిపోయిందట. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ..చిరు, నాగ్‌లతో ఓ సినిమా ప్లాన్ చేశాడట. వీరిద్దరికి ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా.. భారీ బడ్జెట్‌తో సినిమాను తీయాలని భావించాడట. అయితే దానికి తగ్గట్టుగా కథ సెట్ కాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.ఆ తర్వాత కూడా పలువురు దర్శకుడు వీరిద్దరితో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు.అయితే సరైన కథ దొరకపోవడంతో చిరంజీవి, నాగార్జున ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఆ మధ్య అనిల్ రావిపూడి కూడా వీరిద్దరితో కలిసి సినిమా చేస్తాడనే రూమర్ వినిపించింది. చిరంజీవితో తీయబోయే సినిమాలో నాగార్జున కూడా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఒట్టి పుకారే అని తేలిపోయింది. సరైన కథ రావాలే కానీ కలిసి నటించడానికి తాము రెడీ అని చిరు, నాగ్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ మన దర్శక-రచయితలే వారిని మెప్పించే కథలను సిద్ధం చేయడం లేదు. మరి వారిద్దరు మెచ్చే కథ ఏ దర్శకుడు తీసుకొస్తాడో..అసలు చిరు-నాగ్ కాంబినేషన్లో సినిమా వస్తుందో రాదో చూడాలి. -
సెల్పీరాజా ఫస్ట్ లుక్
కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ సెల్పీరాజా. గతంలో విజయ్ మాల్యాతో కలిసి నరేష్ దిగిన ఫోటోతో ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్. తాజాగా దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో గోపి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు జి నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా అప్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా సెల్ఫీరాజాను తెరకెక్కిస్తున్నారు.