breaking news
Evergreen hero
-
అభిరుచులే అమితానందం
ఆయన భారతీయ వెండితెరపై ఏకైక సుదీర్ఘ కాల సూపర్ స్టార్. ఎన్ని విజయ శిఖరాలను అధిరోహించారో, అన్ని అడ్డంకులనూ అధిగమించారు. ఇంటా బయటా వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఈ దిగ్గజ నటుడు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో... అయినా 80 ఏళ్ల వయసులోనూ ఎవర్గ్రీన్ స్టార్‌గా కొనసాగడం వెనుక... ఆయన అనన్య సామాన్య వ్యక్తిత్వం మాత్రమే కాదు ఆయనకున్న అనూహ్యమైన అభిరుచులూ శక్తి మేరకు దోహదం చేశాయని చెపొ్పచ్చు. ఐదు దశాబ్దాలకు పైగా నటుడిగా అలరిస్తున్న ఆయనకు సినిమాలతోపాటు అనేక ఆసక్తులు ఉన్నాయి.వారసత్వం... ఆ కవిత్వంఅమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ కవి. ఆ వారసత్వం అమితాబ్‌పై కూడా ప్రభావం చూపింది. కవిత్వాన్ని చదవడం, రాయడం, కవితల్లోని భావాలను ఆస్వాదించడం ఆయనకు ఇష్టం. తన బ్లాగుల్లో కూడా కవితా పంక్తులు, సాహిత్యపరమైన ఆలోచనలు కనిపిస్తుంటాయి. కవిత్వానికి లోతైన అర్థం ఉంటుందని, మంచి కవిత్వం పైకి కనిపించే విషయానికి మించి మరొక భావాన్ని అందిస్తుందని ఆయన అంటారు.బచ్చన్... బ్లాగ్...అమితాబ్‌కు ఉన్న ఆసక్తుల్లో బ్లాగింగ్ది ప్రత్యేక స్థానం. సినిమాలు, షూటింగ్ అనుభవాలు, కుటుంబం, అభిమానులు, తన ఆలోచనలు, జీవితంపై తన అభి్రపాయాలు.. ఇలా ఎన్నో విషయాలను ఆయన స్వయంగా కవిత్వీకరిస్తుంటారు. గత 2008లో బ్లాగింగ్ ప్రారంభించిన ఆయనకు అది కేవలం సోషల్ మీడియా అలవాటుగా మిగలలేదు. అభిమానులను తన ‘ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ’గా భావించేంతగా ఆ అనుబంధం పెరిగింది. ఒకసారి తన బ్లాగ్ సైట్ పోయిందని తెలుసుకున్నప్పుడు అది తన జీవితంలోని ఒక భాగాన్ని కోల్పోయినంత బాధ కలిగించిందని కూడా రాశారు. ఆ తర్వాత కూడా ఆయన బ్లాగింగ్‌ను కొనసాగించారు. 2023లో తన బ్లాగ్ ప్రయాణానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.కలం.. బలమైన ఇష్టం..అమితాబ్ బచ్చన్ హాబీల్లో అత్యంత ఆసక్తికరమైనది పెన్నుల సేకరణ. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన పెన్నులను సేకరించడం ఆయనకు చాలా ఇష్టం. యుక్త వయసు నాటినుంచే ఉన్న ఈ హాబీ వల్ల ఆయన దగ్గర కొన్ని వేల సంఖ్యలో పెన్నులు ఉండొచ్చని అంచనా. పెన్ను కనిపిస్తే దాని డిజైన్, తయారీ, ప్రత్యేకతను చెప్పగలిగేంత ఇష్టం ఆయనది. లగ్జరీ రైటింగ్ ఇన్ స్ట్రుమెంట్ బ్రాండ్ ‘ మోంట్‌బ్లాంక్’ నుంచి ఆయనకు ప్రతి పుట్టినరోజు నాడూ ప్రత్యేకమైన పెన్ను బహుమతిగా అందుకుంటారు.‘వాచ్’కలెక్షన్...పెన్నుల తర్వాత అమితాబ్‌కు అత్యంత ఇష్టమైన కలెక్షన్ గడియారాలదే. ఖరీదైన, అరుదైన, ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన టైమ్పీసులపై ఆయనకు ఆసక్తి ఉంది. ఆయన వాచ్ కలెక్షన్ లో ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు ఉన్నాయంటారు. గత 2016లో ముంబైలోని ఒక హైఎండ్ వాచ్ బొతిక్ ప్రారంభోత్సవానికి అమితాబ్, జయ బచ్చన్ హాజరయ్యారు. ఆ సందర్భంలోనే అమితాబ్‌కు లగ్జరీ వాచ్‌లపై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా ఈ వాచీల కలెక్షన్ హాబీ వచ్చిందని చె΄్పాడు. బచ్చన్ కుటుంబానికి మరో విచిత్రమైన వాచ్ అలవాటు కూడా ఉంది. అమితాబ్, అభిషేక్ ఇద్దరూ కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు గడియారాలు ధరించడం కనిపిస్తుంటుంది. దీని వెనుక ఓ కథ ఉంది. అభిషేక్ స్విట్జర్లాండ్‌లో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న సమయంలో రెండు దేశాల టైమ్జోన్లను తెలుసుకోవడానికి రెండు గడియారాలు ధరించే అలవాటు ఏర్పడిందిట. అదే అలవాటు తర్వాత ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్టైల్‌గా మారింది.‘టెక్’ స్టార్వయసుతో సంబంధం లేకుండా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా అమితాబ్ ముందుంటారు. బ్లాగింగ్, మొబైల్, కంప్యూటర్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాలను ఆయన చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. బ్లాగింగ్ ప్రారంభించిన తొలినాళ్లలోనే మొబైల్ ద్వారా బ్లాగ్ రాసే సదుపాయాన్ని కూడా ఉపయోగించేవారు. తన అభిమానులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకోవచ్చో అమితాబ్ యువనటులకు చేసి చూపించారు.‘హ్యామ్’ రేడియో...క్రేజ్అమెచ్యూర్ రేడియో లేదా హ్యామ్ రేడియోపై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లోని వ్యక్తులతో రేడియో తరంగాల ద్వారా కమ్యూనికేట్ చేసే ఈ అభిరుచి కూడా ఆయన సాంకేతికతపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. అమితాబ్‌కు సంగీతం అన్నా అమితాసక్తి. తనకు నిద్ర పట్టని రాత్రుల గురించి బ్లాగ్‌లో రాసినప్పుడు, మృదువైన శాస్త్రీయ సంగీతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వెల్లడించారు. సితార్, స్లైడ్ గిటార్ వంటి వాద్యాలపై వినిపించే ధ్యానాత్మక సంగీతం రాత్రి నిశ్శబ్దంలో తన మనసుకు శాంతినిస్తుందని ఆయన పేర్కొన్నారు. సంగీతాన్ని ఆయన కేవలం వినోదంగా కాకుండా ఆత్మకు ఓదార్పునిచ్చే అనుభూతిగా భావిస్తారు. – సత్యబాబు, సాక్షి -
ఎవర్గ్రీన్ హీరో ఏఎన్ఆర్
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జీవితం తెరచిన పుస్తకం. దశాబ్దాలుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. తొంభై ఏళ్ల వయసులోనూ నటిస్తూ ఈ తరానికి సవాల్ విసురుతున్నారు. భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరుపుకుంటోన్న నేపథ్యంలో ఏఎన్ఆర్ నటనా జీవితం గురించి ఓ సారి తెలుసుకుందాం. తమిళసినిమా, న్యూస్‌లైన్: తాను ఇప్పటికీ నటనలో విద్యార్థినే అంటారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి ఆయన బాల్యం నుంచే నటనకు అంకితమయ్యూరు. ఏఎన్ఆర్ 1923 సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని రామాపురంలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే కళామతల్లి సేవకు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ. మధ్య తరగతి కుటుంబం. అక్కినేని విద్యాభ్యాసం ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే అప్పట్లో దాన్ని ఒక కొరతగా ఆయన భావించలేదు. పాఠశాల విద్యకు బదులు నటనకు బాటలు వేసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే రంగస్థల నటుడయ్యారు. ఈ పయనంలో ఆయన తల్లి ప్రోత్సాహం మరువలేనిది. అక్కినేని మొదట ప్రాచుర్యం పొందింది స్త్రీ పాత్రల ద్వారానే. ఆ రోజుల్లో స్త్రీలు నటించడానికి ముందుకొచ్చేవారు కాదు. అందువలన వారి పాత్రలనూ పురుషులే పోషించేవారు. అలా అక్కినేని స్త్రీ పాత్రల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే అక్కినేని స్త్రీ పాత్ర వేస్తే సింగారమే అనేవారు. స్ఫూర్తి ప్రదాత నటుడన్న ప్రతి వారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఏఎన్ఆర్. అరుుతే ఘంటసాల బలరామయ్య తనకు స్ఫూర్తి ప్రదాత అంటారు అక్కినేని. బెజవాడ (నేటి విజయవాడ) రైల్వేస్టేషన్లో తారసపడ్డ అక్కినేనిని మద్రాసు తీసుకొచ్చింది ఘంటసాల బలరామయ్యే. ఆయన రూపొందించిన శ్రీరామ జననం చిత్రం ద్వారా అక్కినేని శ్రీరాముడుగా పరిచయమయ్యారు. అయితే నాగేశ్వరరావు తొలి చిత్రంగా ధర్మపత్నిగా నమోదైంది. ఈ చిత్రంలో హీరోకు స్నేహితుడిగా అక్కినేని నటించారు. విజయ దుందుభి బాలరాజు, కీలుగుర్రం చిత్రాలతో అక్కినేని విజయ దుందుభి మొదలైంది. తర్వాత ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అక్కినేని చేయని పాత్రంటూ లేదు. దేవదాసు, ప్రేమనగర్, అనార్కలి, భక్త తుకారం, సెక్రటరీ, తెనాలి రామకృష్ణ, మాంగల్యబలం, మంచి మనసులు, అంతస్తులు, దసరాబుల్లోడు, ప్రేమాభిషేకం ఇలా ఒక్కో చిత్రం ఆణిముత్యమే. క్లాస్ హీరో తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరువలేని నటుడు ఎన్టీఆర్. ఆయనకు సాటి ఏఎన్ఆరే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య చక్కని స్నేహబంధం ఉండేది. ఏఎన్ఆర్ క్లాస్ హీరోగా, ఎన్టీఆర్ మాస్ హీరోగా పేరు పొందారు. పాత్రల్లో వీరి మధ్య పోటీ తీవ్రస్థారుులో ఉందని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే తానెవరినీ పోటీగా భావించడం లేదని, నటనను ఆస్వాదిస్తున్నానని అక్కినేని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గుప్తదానాలెన్నో.. గుప్త దానాలతో ఎందరినో ఆదుకున్న దాత ఏఎన్ఆర్. ఈయన బాల్యంలో విద్యకు దూరమయ్యూరు. విద్య ప్రాధాన్యం గుర్తించిన అక్కినేని విద్యాదాతగా మారారు. గుడివాడలో అక్కినేని కళాశాల నెలకొల్పారు. ఈ కళాశాలకు అక్కినేని పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. అలాగే గుప్తదానాలు ఎన్నో చేశారు. అవార్డులకే అలంకారం అక్కినేని నాగేశ్వరరావును ఎన్నో అవార్డులు వరించారుు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. వెండితెర పితామహుడు రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్ ఇలా ఎన్నో అవార్డులు అక్కినేనిని వరించారుు. అరుు తే అవార్డులకే ఆయన అలంకారమయ్యూరు. 90లోనూ నటన బాల నటుడిగా జీవితం ప్రారంభించారు అక్కినేని. తొంభై ఏళ్ల వయసులోనూ ఆయన నటిస్తున్నారు. తాజాగా మనం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఏఎన్ఆర్ కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్య నటిస్తుండడం విశేషం. ఇలా ఒకే కుటుంబంలో మూడు తరాల నటులు నటించడం దక్షిణాదిలో ప్రప్రథం. జీవితంలో ఎన్నో సాధించిన అక్కినేనిలోనూ చిన్న అసంతృప్తి ఉంది. గ్లోబల్ స్థాయిలో మన సినిమా స్థానం సంపాదించుకోలేదన్నదే ఆ అసంతృప్తి. ప్రయోగాత్మక చిత్రాలు రావాలన్నది ఆయన మనసులోని భావం. 90 వసంతాల అక్కినేని నాగేశ్వరరావును నూరు వసంతాల సినిమా వేడుకలో ఆదివారం ఘనంగా సత్కరించనున్నారు.


