breaking news
epassbook
-
ఈపీఎఫ్‌వో సభ్యులకు ఈ పాస్‌బుక్
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈ–పాస్‌బుక్ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. దీంతో సభ్యులు తమ ఖాతా వివరాలను మరింత గ్రాఫికల్‌గా చూసుకోవచ్చని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈపీఎఫ్‌వోకు సంబంధించి 63 ప్రాంతీయ కార్యాలయాల్లో (100కు పైగా ఉద్యోగులు ఉన్న) క్రెచే సదుపాయాలను సైతం మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఉద్యోగులు తమ పిల్లలను ఇక్కడ విడిచి విధులు నిర్వహించుకోవచ్చు. పిల్లల సంరక్షణ బాధ్యతను అక్కడి సిబ్బంది చూసుకుంటారు. -
ఈపీఎఫ్ పోర్టల్‌లో సమస్యలు.. వినియోగదారులకు చుక్కలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వెబ్ సైట్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది 2021-2022 కాలానికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.1శాతానికి పెరిగాయి. అయితే పెంచిన ఆ వడ్డీ రేట్లు ఈపీఎఫ్ పోర్టల్‌లో మాయమయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు పాస్‌బుక్ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తు ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. అయినా పోర్టల్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. జనవరి 14 సాయంత్రం 5గంటలకు అప్డేట్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ తరహా మెసేజ్‌లు గతకొన్ని రోజులుగా అలాగే చూపిస్తున్నట్లు యూజర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై వినియోగదారులు ట్విటర్లో ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు ఈపాస్ బుక్ కనిపించడం లేదంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఫిర్యాదులపై ఈపీఎఫ్‌వో ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని, యూజర్ల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రిప్లయి ఇచ్చారు. For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 -
ఈ–పాస్‌బుక్ విధానం వద్దు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఈ–పాస్‌బుక్ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని క్రాంతిభవన్‌లో అఖిలపక్ష రైతు సంఘ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ రైతులకు భూ హక్కుపై నమ్మకం కల్పిస్తూ ఎన్టీఆర్ పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను జారీ చేయగా ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థలో అవినీతి కారణంగా ఆ వివరాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ఈ–పాస్‌బుక్‌లో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తక్షణమే రీసెటిల్మెంట్ సర్వే చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో కె.మోహనరావు, అప్పారావు, ఎ.సూరిబావు తదితరులు పాల్గొన్నారు. -
కాసుపుస్తకం
- రెవెన్యూకు అవినీతి జబ్బు - తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న వైనం - పాస్‌పుస్తకాల జారీలో లొసుగులతో కాసుల పంట - ఆర్జీదారులకు తప్పని ఇబ్బందులు - ప్రక్రియలో కానరాని పారదర్శకత మొన్న పాస్‌పుస్తకాల ముద్రణ.. నిన్న యూనిక్‌కోడ్... నేడు ఈ-పాస్‌పుస్తకాలు... ఇవీ పట్టాదారు పాస్‌పుస్తకాల జారీలో తీవ్ర జాప్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు. ఇలా ఎన్ని తీసుకొస్తున్నా రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం రైతులను ముప్పుతిప్పలు పెట్టడం పరిపాటవుతోంది. విసిగిపోయిన అన్నదాతలు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించడం, వారు దాడులు చేపట్టడం ఇందుకు నిదర్శనం. యలమంచిలి: పట్టాదారు పాస్‌పుస్తకాల జారీలో లొసుగులను అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. పాస్‌పుస్తకం కావాలంటే నిన్నటి వరకు తహశీల్దార్‌కు ఆర్జీపెట్టుకుని అధికారుల కరుణ లభించే వరకు కార్యాలయం చుట్టూ తిరిగాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త విధానంలో ఈ-పాస్‌పుస్తకాలను మీ-సేవా కేంద్రాల ద్వారా జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలోనే పలువురు వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు రైతులు, ఆర్జీదారుల నుంచి లంచాలు భారీగా వసూలు చేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో ముగ్గురు వీఆర్వోలు, తాజాగా సోమవారం భీమునిపట్నం తహశీల్దార్ అవినీతి నిరోధక శాఖాధికారులకు ఇదే విషయంలో పట్టుబడ్డారు. ఇలా ఏసీబీ అధికారులకు పట్టుబడినవారు కొందరేనని, దాదాపుగా అవినీతి జబ్బు అన్ని రెవెన్యూ కార్యాలయాల్లోనూ సాగుతోందన్న వాదన ఉంది. మీ-సేవా కేంద్రాల రాకతో రెవెన్యూ శాఖలో అనూహ్య సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. మాన్యువల్ ధ్రువీకరణ పత్రాల జారీ తగ్గిపోయింది. తాజాగా పట్టాదారు పాస్‌పుస్తకాలను సైతం మీ-సేవాల ద్వారానే జారీకి సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేసి రెవెన్యూ రికార్డుల మేరకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధారణంగా ఒక రైతు భూమిని విక్రయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఆ వివరాలు వన్‌బీ రికార్డుల్లో నమోదవ్వాలి. అదే విధంగా విక్రయదారుని పేరుమీద అడంగల్ తప్పనిసరి. కొనుగోలుదారు కూడా వెంటనే రెవెన్యూ రికార్డులో మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం రెవెన్యూ శాఖ ‘వెబ్‌ల్యాండ్’ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించి పాస్‌పుస్తకాల జారీకి శ్రీకారం చుట్టింది. ఇంత చేస్తున్నా పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియలో ఎడతెగని జాప్యం తప్పడం లేదు. ఈ మొత్తం ప్రక్రియలో లొసుగులను అడ్డం పెట్టుకుంటున్న రెవెన్యూ యంత్రాంగానికి పాస్‌పుస్తకాల జారీ కాసుల పంట పండిస్తోంది. కొందరు అధికారులు రైతులను తమ కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పుకుంటున్నారు. ఇదే క్రమంలో భారీగా లంచాలను డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సి రావడంతో పనులు కోల్పోతున్నామనే భావనతో ఆర్జీదారులు రెవెన్యూ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఇదే అదునుగా కొందరు రెవెన్యూ అధికారులు ఆర్జీదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో విసుగు చెందిన ఆర్జీదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. భూ విస్తీర్ణం నమోదుకు రెండేళ్లు తిప్పారు పట్టాదారు పాస్‌పుస్తకాలతోపాటు చాలా పనులకు ఆర్జీదారులను కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పించుకోవడం ద్వారా రెవెన్యూ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి నిరుపేదలనూ అవస్థలకు గురిచేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో భూ విస్తీర్ణం నమోదుకు రెండేళ్ల పాటు నన్ను రెవెన్యూ అధికారులు తిప్పించుకున్నారు. చివరకు జిల్లా కలెక్టర్ దృష్టికి రెండుసార్లు, పత్రికల ద్వారా నా ఇబ్బంది చెప్పుకుంటే గాని పని జరగలేదు. -పాల అప్పారావు, రైతు, యలమంచిలి రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రెవెన్యూ కార్యాలయాల్లో పనులు కావాలంటే సొమ్ములు ముట్టజెప్పాల్సిందే. చాలా కాలంగా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న రెవెన్యూ సిబ్బంది తీరే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అవినీతికి అవకాశం లేకుండా పనులు పూర్తయ్యేలా సంస్కరణలు చేపట్టాలి. అలా చేస్తే రైతులంతా ఎంతో సంతోషిస్తారు. - యల్లపు శ్రీనివాస్, సోమలింగపాలెం, యలమంచిలి