breaking news
EPA
-
20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తెచ్చింది. టెస్లా కార్లు ఒక్క సారి ఛార్జ్ చేస్తే సుమారు 758 కిలోమీటర్లకు వరకు ప్రయాణిస్తాయి. రేంజ్ విషయంలో టెస్లాను అధిగమించడానికి పలు ఆటోమొబైల్ కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా టెస్లాకు పోటీగా అమెరికన్ స్టార్టప్ లూసిడ్ మోటార్స్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ కారును తీసుకురానుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! లూసిడ్ కార్లు టెస్లా కార్ల కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. టెస్లా కార్లకు పోటీగా లూసిడ్ తన కారును తయారుచేస్తోంది. ఈ కారున ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 840 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి.ఇది టెస్లా మోడల్ ఎస్ లాంగ్ రేంజ్ కంటే 161 కిమీ ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అంతేకాకుండా కారులో అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌ను ఏర్పాటుచేయడంతో కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ కారు 482 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని లూసిడ్ వెల్లడించింది. ఈ కారు 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఈ ఎడాది చివర్లో అమ్మకాలను జరపాలని కంపెనీ భావిస్తోంది. ఈ కారు సుమారు రూ. 57 లక్షల నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ 113కేడబ్ల్యూహెచ్ బ్యాటరీను అమర్చారు. ఈ కారులో డ్యూయల్ ఆక్టివ్ కోర్ మోటార్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా కారులో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకుగాను సెమి ఆక్టివ్ సప్సెన్షన్‌ను వాడారు. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
భారత్ జవాబుదారీ కాదు
పారిస్ ఒప్పందంపై వైట్‌హౌస్ ప్రకటన వాషింగ్టన్: పారిస్ వాతావరణ ఒప్పందంలో కర్బన ఉద్గారాలపై భారత్, చైనా వంటి దేశాలను జవాబుదారీ చేయడం లేదని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పేర్కొంది. ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. 2030 వరకూ చైనా కర్బన ఉద్గారాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోదని, భారత్‌కు 2.5 ట్రిలియన్ డాలర్ల సహాయం అందేవరకూ ఎటువంటి బాధ్యతలు లేవని వైట్‌హౌస్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) స్కాట్ ప్రుయిట్ చెప్పారు. ఏడాదిన్నర క్రితం పారిస్ ఒప్పందాన్ని 150కిపైగా దేశాలు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం నుంచి తప్పు కోవాలని ట్రంప్ సాహ సోపేతమైన నిర్ణయం తీసుకున్నారని స్కాట్ కొనియాడారు. అమెరికాలో గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదలను 26 నుంచి 28 శాతం వరకూ తగ్గించగలిగామని, క్లీన్ పవర్ ప్లాన్, వాతావరణ యాక్షన్ ఎజెండా ద్వారా ఇది సాధిం చగలిగామని చెప్పారు. అమెరికా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకు న్నారని, వాతావరణ ఒప్పందాలను, అంతర్జాతీయ చర్చలను తమ దేశం గౌరవిస్తుందని అన్నారు. కాగా, భారత్, చైనాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని అమెరికాకు చెందిన ఫ్యాక్ట్‌చెక్.ఆర్గ్ అనే వెబ్ బేస్డ్ మీడియా స్పష్టం చేసింది. పారిస్ ఒప్పందం వందలాది బొగ్గు ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైనాను అనుమతిస్తోందని, 2020 నాటికి భారత్‌లో బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు సహకరిస్తోందని, కానీ అమెరికాలో ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిం చడం లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే.. అమెరికా ఎంతో ముందుందని, అయినా చైనా, భారత్ పర్యావరణానికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు అంగీకరించాయని, ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం అమెరికాలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఆర్థికంగా భారంగా మారాయని, దీనికి ఇతర మార్గాల్లో తక్కువ ధరకే విద్యుత్ లభించడమే కారణమని ఫ్యాక్ట్‌చెక్.ఆర్గ్ మేనేజింగ్ ఎడిటర్ లోరి రాబిన్సన్ స్పష్టం చేశారు.