breaking news
Entertainer
-
బెస్ట్ ఎంటర్టైనర్ వెంకటేశ్... యాక్టర్ నాగచైతన్య
సైమా అవార్డుల వేడుక (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్–2026) బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగింది. తొలి రోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేయగా, రెండో రోజు తమిళ, మలయాళ భాషల చిత్రాల్లో ప్రతిభ చూపిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కు అవార్డుల ప్రదానం జరిగింది. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు సాధించింది. నాలుగు విభాగాల్లో ‘మిరాయ్’ సినిమాకు అవార్డులు లభించాయి. బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు వెంకటేశ్‌కి, ‘తండేల్’ సినిమాలోని నటన నాగచైతన్యకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకువస్తే, ‘మిరాయ్’ చిత్రానికిగానూ తేజ సజ్జాకు క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’ నిలవగా, ఉత్తమ దర్శకుడి అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకుగానూ అనిల్ రావిపూడి అందుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు నటి ఐశ్వర్యా రాజేష్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)కు లభించింది. 2025లో విడుదలైన దక్షిణాది సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. -
మదర్ సెంటిమెంట్‌తో సదా `నంద`
సదా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నంద’. గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో కళ్యాణ్ ఎర్రగుంట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శకుడు మాట్లాడుతూ..‘నేను హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో `నంద` చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నా. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం మా చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు సమకూర్చారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం ` అన్నారు. ఈ చిత్రానికి డిఓపీః జైపాల్ రెడ్డి నిమ్మల; సంగీతంః చరణ్ అర్జున్.


