breaking news
English channel
-
రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు
రష్యా నుంచి భారతదేశానికి వస్తూ ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటుతున్న షాడో- ప్లీట్ అనే ఆయిల్ ట్యాంకర్‌ను బ్రిటన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌక కెప్టెన్‌నైనా అజయ్ పంత్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆ కెప్టెన్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆయనను విడిపియ్యాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు."రష్యా (ఆంక్షలు) నిబంధనలు 2019" లోని 'రెగ్యులేషన్ 46Z9B' ని ఉల్లంఘిస్తూ.. రష్యా చమురును ఇతర దేశానికి ఓడ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సరఫరా చేసినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.అయితే ఆయన తరపున కేసు వాదించిన "ఈ నౌక ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి సరుకును తీసుకెళ్లాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఆయన కేవలం కార్పొరేషన్ (కంపెనీ) ఆదేశాలను మాత్రమే పాటించారు. ఆయన తన ఉద్యోగాన్ని చేసుకుంటున్న ఒక ఉద్యోగి మాత్రమే, ఇప్పుడు బ్రిటీష్ కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న అక్కడి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.భార్య ఆవేదనఅజయ్ పంత్ భార్య.. రీతు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బ్రిటీష్ మీడియా నివేదికల ద్వారానే తన భర్త అరెస్ట్ విషయం తెలిసింది. UK లేదా భారత అధికారుల నుండి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పారు. ఆయన కేవలం కంపెనీ ఆదేశాల మేరకే నౌకను నడిపారని, ఇందులో ఆయన తప్పేమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందనదీనిపై ఉత్తరాఖండ్ హోం సెక్రటరీ శైలేష్ బగౌలీ స్పందిస్తూ.. పంత్ విడుదల మరియు పునరాగమనం కోసం సహాయం చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ కు లేఖ రాశామని తెలిపారు. ఢిల్లీలోని తమ ప్రాంతీయ కమిషనర్ కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా UKలోని భారత హైకమిషన్‌కు పంత్‌ను కలుసుకునేందుకు అనుమతి లభించింది..కాగా బ్రిటన్ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. రాయల్ మెరైన్ కమాండోలు రాత్రి వేళల్లో 'చినూక్' హెలికాప్టర్ ద్వారా నౌకపైకి దిగారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు నౌకలోని పత్రాలను తనిఖీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని చెబుతూ, ఇది "రష్యాకు తగిలిన మరో దెబ్బ" అని అభివర్ణించారు. -
ఇంగ్లిష్ జల సంధిని ఈదిన ఆంధ్ర హెడ్ కానిస్టేబుల్!
విజయవాడ: స్విమ్మింగ్ మౌంట్ ఎవరెస్ట్‌గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని కలైస్ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు. స్విమ్మర్ తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతంలో పాక్ జలసంధి(భారత్–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్ డిగ్రీల చలి, షార్క్‌లు, జెల్లీ ఫిష్‌లు కలిగిన ఇంగ్లిష్ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అభినందించారు. ఇదీ చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
‘భార్యను కాలేకపోయా.. అమ్మగా మాత్రం చనిపోతా’
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత ఎంతటి డేరింగ్ డైనమిక్ నాయకురాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే దానికోసం ఎలాంటి పరిస్థితుల్లో నిలబడతారు. అవసరం అయితే ఓడిపోతున్నా తిరిగి ఆ ఓటమిని గెలుపుగా మార్చుకునేవరకు విశ్రమించరు. ఆమె గురించి పలువురికి పలు అనుమానాలు ఉండొచ్చేమోగానీ, ఆమెకు మాత్రం పూర్తి స్పష్టత ఉంటుంది. జయ ఎంత డేరింగో, ఆమె ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఎలా ఇస్తారో ఒక సంఘటనను పరిశీలిస్తే.. 1999లో ఓ ఆంగ్ల చానెల్ జయలలితను వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. మీ జీవితంలో ప్రతి మలుపులో భిన్న రూమర్లు వస్తున్నాయిగా అని ప్రశ్నించగా ఆమె చాలా ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ’నేను వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యాను. నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఎంజీఆర్‌ను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నేను అదే చేశాను. అయితే, చట్టబద్ధమైన సంబంధానికి(పెళ్లికి) నేను అంగీకరించలేదు. నన్ను నేను గుర్తించాలన్న కసి నాలో మొదలైంది. మా అమ్మ ఇప్పుడు బతికే ఉంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నా వ్యక్తిగత జీవితం తప్పకుండా మరోలా ఉండేదని నేనెప్పుడు బాధపడుతుంటాను. నా గుర్తింపు అంటే ఎంజీఆర్ అని నిరూపించాలని అనుకున్నాను. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి పుట్టి కూతురుగా పెరిగి భార్యగా కాపురం చేసి తల్లిగా చనిపోవాలి. కానీ నేను భార్య స్థానాన్ని పొందలేకపోయాను. కానీ, చివరికి అమ్మగా గుర్తింపును పొంది మాత్రం చనిపోతాను’ అంటూ ఓ సందర్భంలో ఆమె చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు.


