చారిత్రక టూర్ ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. తమ అండర్-19 జట్టును ఇంగ్లండ్ పర్యటనకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఒక ఫోర్ డే మ్యాచ్‌తో పాటు నాలుగు యూత్ వన్డేలు ఆడననున్నట్లు తెలిపింది.కాగా పాక్ అండర్-19 జట్టు చివరగా 2023లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాడు రెండు యూత్ టెస్టులతో పాటు ఐదు యూత్ వన్డేలు ఆడింది. టెస్టు సిరీస్ డ్రా కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.భవిష్య ఈవెంట్లకు సన్నాహకంగా..ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి యంగ్ షాహిన్స్ జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. కాగా పాక్ అండర్-19 టీమ్ గతేడాది కాలంగా మంచి ఫామ్‌లో ఉంది. ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత జట్టును ఓడించి టైటిల్ గెలిచింది.ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజయం సాధించింది. జింబాబ్వే, అఫ్గనిస్తాన్‌లపై గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2025 టోర్నీలో మాత్రం పాక్ ఐదింట కేవలం మూడే గెలిచింది. ఇంగ్లండ్‌తో పాటు భారత్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ఈ టోర్నీలో యువ భారత జట్టు గెలుపొంది.. ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇదిలా ఉంటే.. రానున్న ఐసీసీ ఈవెంట్లకు సన్నాహకంగా పాక్ అండర్-19 జట్టుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులపై పాక్ యువ ఆటగాళ్లు అవగాహన పెంపొందించుకునేలా ఈ టూర్ ఉపయోగపడనుంది. ఆసియా కప్‌తో పాటు భవిష్య ముక్కోణపు సిరీస్‌లకు ఈ పర్యటన ద్వారా మంచి ప్రాక్టీస్ దొరకనుంది.ఇంగ్లండ్ అండర్-19 వర్సెస్ పాక్ అండర్-19 సిరీస్ షెడ్యూల్👉యూత్ టెస్టు: సెప్టెంబరు 2-5- అరుండేల్👉తొలి యూత్ వన్డే: సెప్టెంబరు 9- అరుండేల్👉రెండో యూత్ వన్డే: సెప్టెంబరు 12- గిల్డ్‌ఫోర్డ్👉మూడో యూత్ వన్డే: సెప్టెంబరు 14- వార్మ్స్లే👉నాలుగో యూత్ వన్డే: సెప్టెంబరు 16- వార్మ్స్లే.చదవండి: నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా?