breaking news
Endowment Tribunal
-
జూన్‌లోపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి
ఎండోమెంట్ ట్రిబ్యునల్‌పై దేవాదాయ శాఖకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి జూన్ వరకు హైకోర్టు గడువునిచ్చింది. జూన్‌లోపు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకుంటే దేవాదాయశాఖ కార్యదర్శి స్వయంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దేవాదాయ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌లోని దత్తాత్రేయ, నవగ్రహ దేవస్థాన పాలక మండలి హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ప్రభుత్వ వివరణ కోరారు. ట్రిబ్యునల్ ఏర్పాటు పరిశీలనలో ఉందని, 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్ కోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి 8 వారాల్లో ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, చైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశిస్తూ గత ఏడాది డిసెంబర్ 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో పిటిషనర్ దేవాదాయశాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని జస్టిస్ నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు. -
యలమంచిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబుకు షాక్
అక్రమ ఇళ్ల నిర్మాణాలపై విశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. అక్రమ నిర్మాణాలపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు యలమంచిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబుకు షాకిచ్చింది. నగరంలోని అక్రమ నిర్మాణలకు ఎమ్మెల్యే పాల్పడినట్టు ట్రిబ్యునల్ తప్పపట్టింది. అక్రమంగా నిర్మించిన ఇంటిని జూన్ 29లోగా ఖాళీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఎమ్మెల్యే కన్నబాబు ఇంకా ఏమి స్పందించలేదు. ఇటీవల ఓ ప్రయివేటు కేసుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై పోలీసు అధికారులతో పాటు ఎమ్మెల్యే కన్నబాబు, మరో ఇద్దరు పట్టు పరిశ్రమ ఉద్యోగులు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేయాలని విశాఖ జిల్ఆ పాడేరు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదంతోపాటు తాజాగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పుతో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.