ముగిసిన శ్రావణమాస ఉత్సవాలు
నారాయణపేట రూరల్ : పట్టణ వీరశైవ సమాజం, లింగ బలిజ కులస్తులు ఆదివారం శ్రావణమాస ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బసవేశ్వర మందిరంలో అర్చకులు బుస్సయ్యస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురవీధుల గుండా జల్ధిబిందె ఊరేగింపు నిర్వహించారు. స్వామి వారి పల్లకీసేవను కన్నులపండువగా చేపట్టారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జాజాపూర్ సిద్రామప్ప, జయప్రకాష్, బాలింగం, శివకుమార్, మల్కెడ్ జగదీష్, దామరగిద్ద శివరాజ్, మల్లు, మంగిలి సంఘు, శ్రీధర్, అప్పి, ఆకుల బాబు, సులెగం నాగరాజ్, లక్ష్మికాంత్, జ్యోతిర్నాథ్, మోర్లపల్లి జగదీష్, గందె మల్లికార్జున్, వినోద్, డీబీ. సంపత్, వీరన్న పాల్గొన్నారు.