breaking news
Employees attacks
-
‘విస్ట్రాన్’లో వేలాది ఐఫోన్లు లూటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నరసాపురాలోని ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్లో అత్యంత విలువైన వేలాది ఐఫోన్లు లూటీకి గురయ్యాయి. ఉద్యోగుల హింసాకాండ వల్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు విస్ట్రాన్ ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విస్ట్రాన్ ప్లాంట్లో ఉద్యోగులు శనివారం తీవ్ర బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ప్లాంట్ చాలావరకు ధ్వంసమైంది. విలువైన యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆçహుతయ్యాయి. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు హింసాకాండకు పాల్పడ్డారని విస్ట్రాన్ ప్రతినిధి టీడీ ప్రశాంత్ చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు, కర్ణాటక కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు 149 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విస్ట్రా కంపెనీలో దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
అధికారులపై దాడులు కొత్త కాదు: అశోక్బాబు
హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరగలేదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అశోక్బాబు అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలో దాడికి గురైన తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ అందిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఉద్యోగులపై దాడులు కొత్తగా జరుగుతున్నవి కాదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని, వనజాక్షికి బెదిరింపు లేఖ ఎలా వచ్చిందో? దాని వెనుక రాజకీయంగా ఎవరున్నారో విచారణలో తేలుతుందంటూ టీడీపీ సర్కారును అశోక్బాబు వెనకేసుకొచ్చారు. కాగా, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ, గుంటూరు తహసీల్దారుపై దాడి నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆర్థిక మంత్రి, సీఎం పేషీలోని ముఖ్య కార్యదర్శిని కలిసి చర్చించారు.