breaking news
employees allocations
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ఉద్యోగులను అనేక రకాలుగా వేధిస్తోంది. దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు యాజమాన్యం నుంచి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల అలవెన్స్‌లు, హెచ్ఆర్ఏను యాజమాన్యం తొలగించింది. అలాగే, దాదాపు 500 మంది ఉద్యోగులను నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న దాదాపు 3000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోంది. మరోవైపు.. వీఆర్ఎస్ పేరుతో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ప్రయత్నాలు అన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగమేనని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఇక, ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మూసివేత కారణంగా 455 మంది శాశ్వత, 2500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మొదపకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కార్మికులు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల ఆరాచకం.. వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి -
ఆర్డర్ టు సర్వ్
ప్రస్తుతం ఈ ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు శాశ్వత కేటాయింపులకు సంవత్సరం పట్టే అవకాశం జూన్ నాటికి పూర్తి చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం మూడు జిల్లాలపైనే దృష్టి హన్మకొండ అర్బన్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. కార్యాలయాల గుర్తింపు.. సౌకర్యాలు.. ఫైళ్ల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో తలమునకలైన ఉద్యోగుల్లో.. తమ భవితవ్యం ఏమిటనే ఆందోళన కూడా ఉంది. ఇప్పటివరకు కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక అంశాలపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల విభజనలో వేగంగా ముందుకు వెళ్లడం లేదు. ఉద్యోగుల బదిలీలకు, కేటాయింపులకు ప్రామాణికం ఏమిటనే విషయంపై స్పష్టత లేదు. దీంతో విభజన సమయంలో సహజ న్యాయ సూత్రం అన్నట్లు ‘ఆర్డర్ టు సర్వ్’ నిబంధనల మేరకు ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయని, ఆ మేరకు పనిచేయాల్సి ఉంటుదని ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఆర్టర్ టు సర్వ్ అంటే... తాత్కాలిక కేటాయింపుల ఉత్తర్వులను ఆర్డర్ టు సర్వ్ అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సమయంలో ఈ ఉత్తర్వుల మేరకే ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగుల పంపకం చేశారు. అనంతరం కమలనాథన్ కమిటీ పూర్తి స్థాయి కేటాయింపులు నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూస్తోంది. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా ఇదే విధమైన ఉత్తర్వులతో ఉద్యోగులు వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు కేటాయించబడతారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. కొత్త చోటుకు వెళ్లే ఉద్యోగులు అభ్యంతరాలువ్యక్తం చేయరాదు. ఎందుకంటే.. ఇవి తాత్కాలిక కేటాయింపులే కాబట్టి ఎక్కడికి బదిలీ చేసినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కమిటీ ద్వారానే కేటాయింపుల నింబంధనలు జిల్లాల విభజనకు సంబంధించి ప్రస్తుతం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీనే ఉద్యోగుల కేటాయింపులు చూస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసినా కేటాయింపుల విషయంలో ఉద్యోగుల స్థానికత, ఆప్షన్స్, సీనియార్టీ తదితర విషయాలు పరిశీలిస్తారు. వాటి మేరకు కేటాయింపులు ఉంటాయి. అయితే ఇది పూర్తి కావడానికి ఎంత వేగంగా చేసినా కనీసం సంవత్సరకాలం పట్టవచ్చని సీనియర్ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ద్వారా.. ఉద్యోగులను వారి స్వస్థలం ఆధారంగా(610జీవో) ఆయా జిల్లాలకు కేటాయిస్తారు. ఈ సమయంలో ఉద్యోగులు తమ కేటయింపుల విషయంలో అభ్యంతరాలు ఉన్నట్లయితే వ్యక్తం చేయవచ్చు. ఈ విధంగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కేటాయించబడిన ఉద్యోగులు ఒక వేళ ఇతర జిల్లాలకు మారాలంటే జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో శాఖ పరంగా డిప్యూటేషన్ ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఈ అవకాశం శాశ్వత కేటాయింపులు పూర్తయిన తరువాతే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కేటాయించిన చోట విధులు నిర్వహించాల్సి ఉంటుంది. శాఖల విలీనం.. ప్రస్తుతం జిల్లాల ఏర్పాటు సమయంలో కొన్ని శాఖలు కలిపి ఉమ్మడిగా చేయాలని ఆలోచనలు ఉన్నా ఈ విషయంలో చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. సీనియార్టీ, హోదా విషయాల్లో చిక్కులు తప్పక పోవచ్చు. అయితే శాఖల విలీనం కాకుండా మధ్యేమార్గంగా శాఖలు వేరైనప్పటికీ ఒకే ఉన్నతాధికారి కింద పనిచేసేవిధంగా తాత్కాలిక ఏర్పాట్లు చేయవ్చని చర్చ జరుగుతోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగుల కొరత కూడా కొంతవరకు తగ్గుతుంది. ప్రభుత్వ అంతిమ నిర్ణయం మేరకు ఈ విషయంలో కేటాయింపులు ఉంటాయి. జోనల్ వ్యస్థ పక్కకు.. ప్రస్తుతం జోనల్ వ్యవస్థ జోలికి ప్రభుత్వం వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జోనల్ స్థాయి అధికారులను కూడా జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేసే అవకాశాలుఉన్నాయి. జేడీ, డీడీ, ఏడీ స్థాయి అధికారులు ఒక శాఖలో ఉన్నట్లయితే వారిని జిల్లాకు ఒకరిని కేటాయిస్తారు. మిగతా ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చాక జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ నిర్ణయిస్తే అప్పుడు సర్వీస్ రూల్స్ మార్పులు చేసి తదుపరి బదిలీలు, పదోన్నతులు కొనసాగించే అవకాశం ఉంటుంది. జిల్లాలో 40,243 పోస్టులు జిల్లాలో మొత్తం వివిధ స్థాయిలో ఉద్యోగుల పోస్టులు మొత్తం 40,243 ఉన్నాయి. వీటిలో గెజిటెడ్ హోదా పోస్టులు 3502, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులు 31,139, క్లాస్ ఫోర్త్ ఉద్యోగులవి 547, మిగతావి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులవి, పార్ట్‌టైం, కాంట్రాక్ట్వారివి. అయితో ప్రసుతం వివిధ స్థాయిల్లో ఖాళీలుపోను సుమారు 3644 మంది గెజటెడ్, నాన్‌గెజిటెడ్, క్లాస్ ఫోర్త్ హోదాలో పనిచేస్తున్నారు. వీరు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కేటాయింపుల వారీగా వెళ్లాల్సి ఉంటుంది. జూన్‌లోపు ఉద్యోగుల కేటయింపులు పూర్తి చేయాలి ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఉద్యోగుల శాశ్వత కేటయింపుల కోసం సత్వరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి వేగంగా పనులు చేపట్టాలి. జూన్ ఆఖరు నాటికి కేటయింపులు పూర్తిచేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. తద్వారా పిల్లల చదువులు ఇబ్బందులు కాకుండా ఉంటాయి. ఆలస్యం అవుతున్నాకొద్దీ ఉద్యోగుల్లో ఆందోళననెలకొంటుంది. ఇదే విషయం కమిటీకి వివరిస్తాం. విభజన పేరుతో ఉద్యోగులు నష్టపోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించవు. సీనియార్టీ, స్థానికత, ఆప్షన్స్ ప్రకారం కేటాయింపులు ఉండాలి రాజ్‌కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉద్యోగుల స్థానికత, సీనియార్టీ వివరాలు ఉన్నాయి. ఆప్షన్స్‌కూడా తీసుకుంటున్నారు. అందువల్ల ఉద్యోగులను సీనియార్టీ, స్థానికత, ఆప్షన్స్ ఆధారంగా కేటాయింపులు చేపడితో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కొద్దిపాటి మార్పులు ఉన్నా క్రమంగా సర్దుబాటు చేసుకోవచ్చు. లేదంటే ఈ ప్రకియ చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులపై పనిభారం ఎక్కువ ఉండకుండా స్టాప్ ప్యాట్రన్ ఏర్పాటుచేయాలి. -
ఉద్యోగుల అంశంపై కేసీఆర్ అసంతృప్తి
-
ఈ లీకులేంది?
ఉద్యోగుల కేటాయింపు అంశంపై కేసీఆర్ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: విభజన కసరత్తు తీరుతెన్నులపై, ఉద్యోగులు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు తదితరాల కేటాయింపు ప్రక్రియపై కాబోయే సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్న తీరుతో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పుట్టుకురావడమే తప్ప ఉన్నవి పరిష్కారమయ్యే అవకాశాల్లేవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన ప్రక్రియ తీరుతెన్నులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థిక, నీటిపారుదల, ఇంధన, రెవెన్యూ తదితర 10 కీలక శాఖల అధికారులు శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో కేసీఆర్‌కు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని అనవసరంగా గందరగోళం చేస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అసంతృప్తి వెలిబుచ్చారు. దీనికి సంబంధించి పలు లీకులిస్తూ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇవన్నీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్న తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనని మహంతి వివరణ ఇచ్చారు. అపాయింటెడ్ డే అనంతరం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఉద్యోగుల ఆప్షన్లు ఇచ్చి, అందుకు అనుగుణంగా బదిలీ చేయవచ్చని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఆప్షన్లు ఇవ్వడమేమిటని కేసీఆర్ ప్రశ్నించగా, చట్టంలో అలాగే ఉందని అధికారులు వివరణ ఇచ్చారు. రెండు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఇరువురు సీఎంలు, సీఎస్‌లు కూర్చుని సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని వారు సూచించారు. కానీ కేసీఆర్ ఉద్యోగుల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవనాల కేటాయింపు అంశాన్ని ఉదహరించారు. ‘సచివాలయంలో భవనాలు కేటాయించారు. వాటి మధ్య ఉన్న రోడ్ల నిర్వహణను ఎవరు చేపట్టాల్సి ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాలకూ అసెంబ్లీని ఒకే చోట పెట్టడం వల్ల లేనిపోని ఇబ్బందులొస్తాయన్నారు. వేర్వేరుగా కేటాయిస్తే సమస్యే ఉండేది కాదుగా అని ప్రశ్నించినట్లు సమాచారం. పైగా భవనాలను 58:42 నిష్పత్తిలో కేటాయించడాన్ని కూడా తప్పుబట్టారు. ఇదంతా... బంగ్లాదేశ్ విభజన సమయంలో హిందువులకు ఆస్తులు పంచే సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో గది తీసుకోకుండా అన్ని గదులనూ నాలుగేసి భాగాలు చేసుకున్నట్టుగా ఉందన్నారు. ఇలా రోజూ కొట్లాడుకునే పరిస్థితి కల్పించడం సమంజసం కాదన్నారు. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించగా.. దాన్ని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చూసుకుంటుందని వారు బదులిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలకు ఇక్కడే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా చూడాలని కేసీఆర్ సూచించారు. వాటిని కేంద్రం దాకా తీసుకెళ్తే అనవసర జాప్యం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారని ఓ అధికారి చెప్పారు.