Employee life
-
అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం!
సమాజం దృష్టిలో అతను ఒక 'సక్సెస్ఫుల్' పర్సన్. చేతినిండా జీతం, సొంత ఇల్లు, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక మనిషి తన జీవితంలో సాధించాలనుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం ఒక రకమైన శూన్యం. 42 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అంతర్మథనం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మధ్య వయసులో పురుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనంపై ఇది చర్చకు దారితీసింది.కాగితం మీద అంతా పర్ఫెక్ట్! కానీ..ఆ వ్యక్తి తన పోస్ట్‌లో తన ప్రస్తుత స్థితిని ఇలా వివరించారు.. ‘నాకు 42 ఏళ్లు. వార్షిక ఆదాయం రూ. 55 లక్షలు. చెన్నైలో సొంత ఇల్లు ఉంది. భార్య పిల్లలతో జీవితం కాగితం మీద చూస్తే చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. సమాజం నిర్దేశించిన విజయాలన్నీ నేను అందుకున్నాను. కానీ ఈ సక్సెస్ వెనుక ఏదో మిస్ అవుతున్న భావన నన్ను వెంటాడుతోంది’.యంత్రంలా మారిన 40ల జీవితం!తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అతను అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞాపకాల్లో 20లు.. ముచ్చట్లతో 30లు గడిచాయంటూ రాసుకొచ్చిన ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ తన ఒంటరితనాన్ని బయటపెట్టారు. ‘ఇప్పుడు నా ఫోన్ చాలా అరుదుగా మోగుతుంది. వచ్చే కాల్స్ అన్నీ ఆఫీస్ పని గురించో, బ్యాంక్ అలర్ట్ గురించో లేక ఇంటికి వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మని వచ్చే ఆదేశాలో మాత్రమే ఉంటున్నాయి. శారీరకంగా నేను ఒంటరిని కాకపోయినా, మానసికంగా మాత్రం ఒక యంత్రంలా మారిపోయాననిపిస్తోంది’ అని నిట్టూర్చారు.నేనొక ఏటీఎం మెషీన్నా?ఇంటికి వెళ్తే తన బాధ్యతలు తప్ప తన ఉనికికి గుర్తింపు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే. స్కూల్ ఫీజులు కట్టేవాడిగా, ఇంట్లో వైఫై పనిచేయకపోతే బాగు చేసేవాడిగా, రిపేర్లు చూసుకునే వ్యక్తిగానే నా పాత్ర పరిమితమైపోయింది. ఆఫీసులో సీనియర్ హోదాలో ఉండటంతో నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండాలని అందరూ ఆశిస్తారు. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, బలంగా కనిపించాలి. నా బలహీనతను బయటపెట్టే అవకాశం ఎక్కడా లేదు’. అని ఘొల్లుమన్నారు.ఆ 15 నిమిషాలే నా ప్రపంచం!‘కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కావాలనే కారును నెమ్మదిగా నడుపుతాను. ఆ అదనపు 15 నిమిషాలు కారులో ఒంటరిగా ఉన్నప్పుడే.. నేను మళ్లీ 'నేను'లా అనిపిస్తాను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను చేసే చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.ఈ పోస్ట్ చదివిన చాలామంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ రంగంలోని మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్, 'ఇదీ మా కథే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం ఒక్కటే జీవితం కాదని, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధాలు, వ్యక్తిగత సమయం ఎంత అవసరమో ఈ పోస్ట్ గుర్తు చేస్తోంది.Confessions and realities42M, 55LPAI am a 42-year-old man with a senior job in IT. I have a house in Chennai, a supportive wife, and two children. On paper, everything about my life looks perfect. I have achieved all the things society says a man should achieve.In my…— Dr Mouth Matters (@GanKanchi) April 29, 2026 -
విజయాలను వివరించే రెజ్యూమె
ఉద్యోగ సాధనలో రెజ్యూమెదే కీలక పాత్ర. ఇది అభ్యర్థి గురించి రిక్రూటర్‌కు తెలియజేసే సాధనం. రెజ్యూమె ప్రభావవంతంగా ఉంటేనే కొలువు వేటలో విజయం సాధ్యమవుతుంది. రెజ్యూమెలో ఏయే అంశాలుండాలో తెలుసుకోవాలి. అప్పుడే జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న కొత్త అభ్యర్థులు, ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థుల రెజ్యూమెలు వేర్వేరుగా ఉంటాయి. కొత్త అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రస్తావిస్తుంటారు. అనుభవజ్ఞులు మాత్రం తాము ఇప్పటిదాకా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను, సంపాదించిన అనుభవాన్ని కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. రిక్రూటర్లు కూడా వీటినే ఎక్కువగా పరిశీలిస్తారు. అయితే, చాలామందికి రెజ్యూమెలో ఈ విషయాలను ఎలా పొందుపర్చాలో తెలియదు. అన్ని అంశాలను ఒక క్రమపద్ధతిలో వివరిస్తే రిక్రూటర్‌కు సులువుగా అర్థమవుతాయి. ఏయే పదాలను ఉపయోగించాలి, ఏయే పదాలను వాడకూడదో తెలుసుకోవడం మంచిది. కొందరు పాత సంస్థలో నిర్వర్తించిన బాధ్యతలనే విజయాలుగా పేర్కొంటారు. ఇది సరైంది కాదు. మీ కృషితో ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే, సంస్థకు లాభాలు వస్తే.. వాటినే విజయాలంటారు. వాడాల్సిన పదాలు నేను ఫలానా పనికి బాధ్యత వహించాను(రెస్సాన్సిబుల్ ఫర్) అంటూ రెజ్యూమెలో వాక్యాలను ప్రారంభించొద్దు. మీరు సాధించిన సక్సెస్‌ను నొక్కి చెప్పే పదాలనే ఉపయోగించాలి. ఇందుకోసం.. ఫార్ములేటెడ్, యాక్సిలరేటెడ్, ఇన్స్టిట్యూటెడ్, గవర్న్‌డ్, మ్యాక్సిమైజ్డ్, లీవరేజ్డ్, రికగ్నైజ్డ్, నోటెడ్, ప్రెయిజ్డ్, క్రెడిటెడ్.. ఇలాంటి పదాలతోనే వాక్యాలను ప్రారంభించండి. వీటితో మీరు చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం సాధించారో సులువుగా తెలిసిపోతుంది. వాడకూడని పదాలు రెజ్యూమెలో అతిశయోక్తులకు చోటు కల్పించొద్దు. ఇవి రిక్రూటర్‌కు మీపై తేలికభావం కలిగేలా చేస్తాయి. మీ అవకాశాలను దెబ్బతీస్తాయి. కాబట్టి విజనరీ, ఎఫెక్టివ్, ఇన్నోవేటివ్, డైనమిక్ వంటి పదాలను రెజ్యూమెలో రాయకండి. మీరు నిజంగా డైనమిక్ అయితే ఉదాహరణల ద్వారా ఆ విషయం తెలియజేయండి. అంతేతప్ప పదాన్ని ఉపయోగించకండి. అంకెలతో ఆధారాలు మీరు పాత సంస్థలో ఎంతో సాధించి ఉండొచ్చు. భారీగా లాభాలు ఆర్జించి పెట్టొచ్చు. అదే విషయాన్ని బలంగా వివరించాలి. అంటే అంకెలతో ఆధారాలు చూపాలి. నేను సంస్థలో 20 శాతం అమ్మకాలు పెంచాను. వార్షిక సేల్స్ టార్గెట్‌లో 50 శాతం సాధించాను.. ఇలా రెజ్యూమెలో అంకెలను ఉపయోగిస్తే మీ విజయాలపై రిక్రూటర్‌కు నమ్మకం పెరుగుతుంది. తిరగేసిన పిరమిడ్ పద్ధతి తిరగేసిన(ఇన్వర్టెడ్) పిరమిడ్... దీన్ని ఎక్కువగా రచయితలు ఉపయోగిస్తుంటారు. మీరు కూడా రెజ్యూమె రచనలోఈ నిర్మాణాన్ని చేర్చండి. అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మొదట విపులంగా తెలియజేయాలి. అంటే ప్రాధాన్యత క్రమంలో పై నుంచి కిందికి క్రమపద్ధతిలో వివరించాలి.ఉత్తమమైన రెజ్యూమె రచనా పద్ధతి ఇదేనని నిపుణులు చెబుతున్నారు. రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించాలంటే తిరగేసిన పిరమిడ్ పద్ధతిని ఉపయోగించాలి. రిక్రూటర్లు రెజ్యూమెను కిందిదాకా పూర్తిగా చదవలేరు. ప్రారంభంలోనే ముఖ్యమైన సమాచారం ఉంటే... మీ గురించి వారికి పూర్తిగా తెలుస్తుంది.


