breaking news
Emotional support
-
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్‌కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్‌లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
పెంపుడు పంది కోసం న్యాయపోరాటం
కనజోహరే: అమెరికాకు చెందిన ఫ్లాట్ అనే వ్యక్తి ఎల్లి అనే తన పెంపుడు పంది కోసం న్యాయస్థానం మెట్లెక్కాడు. స్థానిక అధికారులు పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని, అది ఫామ్ జంతువని, అందువల్ల దాన్ని ఫామ్‌హౌస్‌లో లేదా అడవిలో వదిలేయాలని ఫ్లాట్‌కు సూచించారు. పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఫ్లాట్ అధికారులపై క్రిమినల్ కేసు వేశాడు. ఎల్లి తనను కష్ట సమయాల్లో ఓదార్చిందని, కుక్కల కన్నా ఎంతో తెలివైందని, దాన్ని వదులుకోనని వాదిస్తున్నాడు. -
ఆత్మహత్య అంటే! ఆపగలిగిన మరణం!!
‘పుట్టిన వాడు గిట్టక తప్పదు...’ ఈ నానుడిలో మహోన్నతమైన తత్వచింతన ఉంది. ఇది ప్రకృతి సహజం కూడా. కానీ... గిట్టడం అనేది సహజంగా లేకపోతే... అసహజ మరణాన్ని స్వీకరించడానికి మనిషి సిద్ధమవుతుంటే... అవాంఛనీయమైన నిర్ణయానికి విరుగుడేది ? జీవనయానంలో ఎదురైన అడ్డంకిని అధిగమించాలి. ఈ ప్రయాణంలో ఎప్పుడూ దారి మూసుకుపోదు అని నమ్మాలి. దారి మళ్లించి మరో దారిలో ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ గురుదత్. నటుడు, దర్శకుడు, నిర్మాతగా వెలిగిన వాడు. అలాంటి వ్యక్తి నలభై ఏళ్లు నిండకనే 1964లో మరణించాడు. నిద్రమాత్రలు కలిసిన మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతడి కుటుంబసభ్యులు మాత్రం... నిద్రమాత్రలను మోతాదుకు మించి పొరపాటుగా తీసుకోవడంతో ప్రాణం పోయిందనుకున్నారు. కానీ గురుదత్ మరణించడానికి ముందురోజు రాత్రి ఆయన్ను కలిసిన సినీ నిర్మాత అబ్రార్ ఆల్వి మాత్రం అది ఆత్మహత్య అయి ఉండవచ్చన్నాడు. ముందురోజు గురుదత్ నిర్లిప్తంగా జీవితేచ్ఛ నశించిన మనిషిలా కనిపించాడని చెప్పాడు ఆల్వి. అలాంటిదే మరో మరణం ఫ్యాషన్ మోడల్ వివేకా బబాజీది. వాణిజ్య ప్రకటనల్లో నటించిన వివేక 2010, జూన్ 25వ తేదీన ముంబయిలో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి వారు మరణించిన సమయంలో కానీ, రెండు రోజుల ముందు కానీ ఆత్మీయమైన పలకరింపు ఉంటే, వారి ఆలోచనలను గాడిలో పెట్టగలిగి ఉంటే ఆ ప్రాణాలు పోయేవి కాదు. ఆత్మహత్య కాదు అది ఆర్తనాదం! ఆత్మహత్య అంటే మరణాన్ని కోరుకోవడం కాదు. బతకాలనే కోరికకు- బతకలేని నిస్సహాయతకు మధ్య పెనుగులాట. ‘నన్ను రక్షించండి’ అని వేడుకునే ఆర్తనాదం. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లు నిర్వేదంగానో, నిర్లిప్తంగానో తమ భావాలను తప్పనిసరిగా వ్యక్తం చేస్తారు. ‘బతకాలని లేదు, చచ్చిపోతే బావుణ్ను, బతికి ప్రయోజనం ఏముంది’ వంటి జీవితేచ్ఛ నశించిన మాటలు వినిపిస్తాయి. భావోద్వేగాలు క్షణాల్లో మారిపోతుంటాయి. దారి చూపించాలి! సాధారణంగా ఆత్మహత్యకు దారి తీసే కారణాలు వయసుల వారీగా మారిపోతుంటాయి. మగవారిలో సాంఘిక, ఆర్థిక కారణాలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటే ఆడవారిలో భావోద్వేగాలు కారణమవుతున్నాయి. ఎవరిలోనైనా తేడాను గమనించిన వెంటనే వారి మనసును మళ్లించాలి. వారితో జీవితేచ్ఛ కలిగించే విషయాన్ని చర్చించాలి. ఎంతటి కష్టంలోనైనా జీవించడానికి ఒకదారి ఉంటుంది. ఆ దారిని వారికి చూపించగలగాలి. ఆత్మహత్యలను నివారించవచ్చు! డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి మానసిక సాంత్వన కలిగించాలి. ఎమోషనల్ సపోర్టు ఒక ప్రాణాన్ని మాత్రమే కాదు. ఆ వ్యక్తి చుట్టూ అల్లుకున్న అనేక మంది జీవితాలను నిలబెడుతుంది. డిప్రెషన్లో ఉన్న వారిని పలకరించి వారు చెప్పేదంతా వినాలి. ఆ తర్వాత మాత్రమే వారికి ఏ విధంగా నచ్చచెప్పాలనే అవగాహన కలుగుతుంది. వారి సమస్యకు పరిష్కారం కూడా వారి మాటల్లోనే వ్యక్తమవుతుంటుంది. జాగ్రత్తగా పరిశీలించి వారికి ధైర్యాన్ని చెప్పడమే ఇందుకు సరైన ఫార్ములా.


