breaking news
Emergency medical service
-
మందు బాబు యాక్షన్.. అవాక్కైన 108 సిబ్బంది
బోధన్ టౌన్ (బోధన్): అత్యవసర వైద్య సేవలకు వినియోగించాల్సిన 108 అంబులెన్స్‌ను ఓ ప్రబుద్ధుడు మద్యం కొనుగోలు కోసం దుర్వినియోగం చేసిన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన శంకర్ మంగళవారం రాత్రి తన ఆరోగ్యం బాగా లేదని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శంకర్ పేరు నమోదు చేసుకొని కొద్దిసేపట్లో డాక్టర్ వస్తారు.. కూర్చోమని చెప్పారు. అయితే ఈలోగా శంకర్ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి కొద్ది దూరంలో ఉన్న మద్యం దుకాణానికి చేరుకొని మద్యం కొనుగోలు చేస్తుండగా గమనించిన 108 సిబ్బంది శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పదిలం సుమా!
విద్యార్థులకు డీఈవో సూచన నేటి నుంచి పదో తరగతి పరీక్షలు విజయవాడ : జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు విద్యార్థులు అరగంట ముందే సెంటర్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, తొమ్మిది గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడుతూ పరీక్షల ఏర్పాట్లను వివరించారు. పరీక్షకు అరగంట ఆలస్యంగా అంటే 10 గంటల వరకు వచ్చినా విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ముందే వచ్చి పరీక్ష ప్రశాంతంగా రాసేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లన్నింటికీ ప్రశ్న పత్రాలు పంపించామని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి బెంచ్‌పైనే కూర్చొని పరీక్ష రాస్తారని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్‌ను పరిశీలించామన్నారు. మంచినీరు, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. -
అరకొర సంఖ్యలో అంబులెన్సులు..!
సాక్షి, ముంబై: లోకల్ రైల్వే పరిధిలోని స్టేషన్లకు ప్రభుత్వం పంపిణీ చేస్తానన్న అంబులెన్సుల సంఖ్యపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకల్ పరిధిలో 120 స్టేషన్లుండగా కేవలం 46 అంబులెన్సులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఇవి ఏ మాత్రం చాలవని అధికారులు చెబుతున్నారు. రైలు ప్రమాదాల్లో గాయపడిన ప్రయాణికులను సత్వరం ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌లు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్’ (ఈఎంఎస్) పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 937 అంబులెన్స్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, బాంబే విక్టోరియా గాంధీ సంయుక్తంగా అంబులెన్స్ సేవలు అందించనున్నాయి. ఇందులో సెంట్రల్ రైల్వేలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ములుండ్ వరకు 18, పశ్చిమ ైరె ల్వేలోని చర్చిగేట్ నుంచి విరార్ వరకు 28 అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయి. కాని ఠాణే నుంచి కల్యాణ్, కర్జత్, కసార, ఖోపోలి, అదేవిధంగా హార్బర్ మార్గంలో సీఎస్టీ నుంచి పన్వేల్, ట్రాన్స్ హార్బర్ మార్గంలో ఠాణే నుంచి పన్వేల్ వరకు ఒక్క అంబులెన్స్ కూడా ప్రకటించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలకు గురైన వారిని ఆస్పత్రికి తరలించే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రోజూ ఏదో ఒక స్టేషన్లో పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురికావడం, నడుస్తున్న రైలు నుంచి కింద పడి, ఓవర్ హెడ్ వైరుకు అంటుకోవడం లేదా ప్లాట్ఫారం-రైలు మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు ఇక్కడ జరుగుతుంటాయి. రోజూ సరాసరి ఐదుగురు చనిపోవడం, పదుల సంఖ్యలో గాయపడడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రమాదానికి గురైన వారిని సత్వరం ఆస్పత్రికి తీసుకెళ్తే మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకు స్టేషన్ బయట అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. కాని నగరం, శివారు ప్రాంతాల్లోని రెండు, మూడు ప్రధాన స్టేషన్లు మినహా మరే ఇతర స్టేషన్లలో అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైల్వే పోలీసులు గత్యంతరం లేక ఆటో, ట్యాక్సీ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే ప్రైవేటు వాహనాలను మాట్లాడి తీసుకొచ్చే వరకూ ఏ మాత్రం జాప్యం జరిగిన విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ స్టేషన్ బయట అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సంకల్పించింది. కాని లోకల్ రైల్వే పరిధిలో సుమారు 120 స్టేషన్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 46 అంబులెన్స్‌లు మాత్రమే అందజేసేందుకు సిద్ధంగా ఉంది. కాని ఇవి ఏ మూలకు సరిపోతాయని రైల్వే అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.