breaking news
emergence of Telangana
-
నమస్తే హైదరాబాద్
ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని నేపథ్యంగా తీసుకొని పి.సి.క్రియేషన్స్ పతాకంపై ‘నమస్తే హైదరాబాద్’ అనే పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి చిమ్మని మనోహర్ దర్శకుడు. చిత్రవిశేషాలను మనోహర్ తెలియజేస్తూ– ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక తెలంగాణ దర్శకుడిగా నేను రూపొందిస్తున్న పూర్తి స్థాయి యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు. చిత్రసంగీతదర్శకుడు ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ – ‘‘మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ ఇది. తెలంగాణ యువతలో మంచి సంగీత జ్ఞానం ఉంది. అందుకే నూతన గాయనీ గాయకులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో పలువురు సింగర్స్‌కు ఆడిషన్స్ నిర్వహించాం’’ అన్నారు. నూతన నటీనటులతో రూపొందనున్న ఈ చిత్రానికి కెమెరా: వీరేంద్ర లలిత్, నిర్మాత: ప్రదీప్‌చంద్ర, కథ–స్క్రీన్‌ప్లే–మాటలు–దర్శకత్వం: చిమ్మని మనోహర్. -
ఇదో భువన విజయం
వరుసగా... అనువుుల(కుందావఝల కృష్ణవుూర్తి), దాశరథి కృష్ణమాచార్య (గిరిజావునోహర్బాబు), సురవరం ప్రతాపరెడ్డి(తిరువుల శ్రీనివాసాచార్య), ఆళ్వార్‌స్వామి(దత్తాత్రేయుశర్మ), కాళోజీ(యుల్లారెడ్డి) తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి దాశరథి కృష్ణమాచార్య 89వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. కొన్ని దశాబ్దాలుగా ‘ఆంధ్రప్రదేశ్’లో ప్రాచుర్యంలో ఉన్న ‘భువనవిజయా’న్ని తలపిస్తూ ‘తెలంగాణ విజయా’న్ని గుర్తు చేస్తూ ‘సుకవితాశరథీ! దాశరథీ’ కార్యక్రమాన్ని అపూర్వంగా ప్రదర్శించింది. భువన విజయంలోని అష్టదిగ్గజ కవులు చారిత్రకంగా సమకాలికులు. అలాగే రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన ‘సుకవితాశరథి’లోని తెలంగాణ కవులు దాశరథికి సమకాలికులు, పూర్వీకులు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డిగా తిరుమల శ్రీనివాసాచార్య, దాశరథిగా గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, వట్టికోట అళ్వారుస్వామిగా దత్తాత్రేయశర్మ, వానమామలై వరదాచార్యులుగా మధుసూదనరావు, కాళోజీగా పొద్దుటూరి యల్లారెడ్డి, అనుముల కృష్ణమూర్తిగా కుందావఝల కృష్ణవుూర్తి, చందాల కేశవదాసుగా పురుషోత్తమాచార్య, పల్లా దుర్గయ్యగా ఆచార్య వేణు, ఒద్దిరాజు సీతారామచంద్రరావుగా మడిపల్లి సుబ్బయ్య, ఆయన సోదరుడు ఒద్దిరాజు రాఘవరావుగా వనం లక్ష్మీకాంతరావు.. దాశరథితో ‘తెలంగాణ చారిత్రక, సాంప్రదాయ, ఉద్యమ ఘట్టాలను’ సమకాలీనులుగా పంచుకున్నారు. అప్పటికప్పుడు ఆయా పాత్రలను పోషించిన కవులు సహజంగా రూపొందించుకోవడం విశేషం. రూపకంలో కొన్ని వ్యక్తీకరణలు... వట్టికోట అళ్వారు స్వామి: నిజామాబాద్ జైల్లో దాశరథీ ‘ఓరోరి నైజాము...’ అంటూ నీవు ఆశువుగా కవిత్వం చెబుతుండగా పళ్లు తోముకునేందుకు ఇచ్చిన బొగ్గు ముక్కతో జైలు గోడలపై రాశాను కదా. రాసింది చూసి, రాసింది నేనేననుకుని పోలీసులు వేరే గదిలో వేసి కొట్టారు. దెబ్బలు గట్టిగా తగిల్నయి. నీది గట్టి కవిత్వం! చందాలకేశవదాసు: దాశరథీ... నీకంటే ఎంతో ముందు పుట్టినవాడిని. పరబ్రహ్మ పరమేశ్వరా, పురుషోత్తమ సదానంద అనే ప్రార్థనా గీతము, భలేమంచి చౌకబేరము- మీరజాలగలడా పాటలు రాస్తోన్న కాలం. నిన్ను అప్పట్లో చూడక పోయినా 15వ ఏట నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నావని నీ గురించి విన్నాను. ‘ నీ నినాదం తెలంగాణ మేనిసొమ్ము’! దాశర థి: తెలంగాణ స్వప్నం ఫలించడం వల్ల మనందరం ఇలా బతికి బట్టకట్టాం. తెలంగాణలో కవులు లేరన్న ‘ముడుంబై’ మాటలను పట్టుదలగా తీసుకుని గోలకొండ కవుల సంచికతో మూడు నూర్ల కవులను పరిచయం చేస్తూ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన సమావేశమైన మనం పోతన వారసులం. ‘ఇమ్మనుజేశ్వరాధముల...’ అన్న పోతన నుంచి మన వరకూ, ఇకముందూ, తెలంగాణ కవులు ధిక్కార కవులే! సాహితీరూపకంలో పాల్గొన్న కవులను, క్వశ్చన్ మార్క్(?) శీర్షికతో దాశరథి రచన ‘ఆ చల్లని సముద్రంలో...’ ఆలపించిన దాశరథి గ్రామస్తుడు నందన్రాజును భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ సత్కరించారు. - పున్నా కృష్ణమూర్తి