breaking news
elle magazine
-
ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
క్రిస్టల్సే దుస్తులుగా.. ఇవా లాంగోరియా కొత్త ఫోజు
ఆమె పేరు ఇవా లాంగోరియా. మంచి నటి, దర్శకురాలు కూడా. ఆమె ఏం చేసినా సంచలనమే. తాజాగా ఇప్పుడు 'ఎల్' అనే పత్రిక కవర్ పేజీ కోసం ఒంటిమీద కేవలం స్వరోవ్స్కీ క్రిస్టల్స్ మాత్రం ధరించి పూర్తి నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చింది. ఈ కవర్ పేజీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంత నగ్నంగా ఫొటోలు తీయించుకోగలనా అన్న భయం మొదట్లో వేసిందని, ఇంత అభద్రతా భావం ఇంతకుముందు ఎప్పుడూ కలగలేదని ఆమె మిర్రర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 2013 డిసెంబర్ సంచిక కవర్ పేజీ మీద ఇవా లాంగోరియా ఇలా దాదాపు పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో దర్శనమిచ్చింది. ప్రత్యేక సంచిక అనగానే ఏదో అనుకున్నాను గానీ, తీరా ఇలా చేసేటప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యానని కూడా లాంగోరియా చెప్పింది. ఆమె ప్రస్తుతం టెలివిసా ప్రెసిడెంట్ జోస్ ఆంటోనియో బాస్టన్తో డేటింగ్ చేస్తున్నట్లు పీపుల్ పత్రిక ఇటీవలే తెలిపింది. అంతకుముందు నాలుగు నెలల పాటు ఎర్నెస్టో ఆర్గెలో అనే బాయ్ఫ్రెండుతో నాలుగు నెలల పాటు మాత్రమే డేటింగ్ చేసి విడిపోయింది.


