breaking news
Easwar
-
తండ్రి డబ్బులివ్వలేదని కుమార్తె కిడ్నాప్!
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. బాలిక తండ్రి తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు.. మువ్వావారిపాలేనికి చెందిన కె.శ్రీనివాసరావు కుమార్తె చీమకుర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తిరుపతికి చెందిన ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను బయటకు పిలిపించాడు. తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తే కావడంతో.. ఈశ్వర్‌రెడ్డి మాయమాటలు నమ్మిన బాలిక అతని బైక్ ఎక్కింది. అనంతరం తిరుపతి వైపు బయలుదేరిన ఈశ్వర్‌రెడ్డి.. కొద్దిసేపటికి బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనందున.. నీ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని చెప్పాడు. దీంతో బాలిక తండ్రి చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సుబ్బారావు వెంటనే కిడ్నాపర్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు. నెల్లూరు జిల్లా కావలి వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను కావలి–నెల్లూరు మధ్యలో అదుపులోకి తీసుకొని.. బాలికను రక్షించారు. -
Allu Arjun Arrest: సాక్షి డిబేట్ లో మాటకు మాట
-
ఈశ్వరయ్య మృతదేహానికి నివాళులు
హైదరాబాద్ : శామీర్‌పేట ఘటనలో నకిలీనోట్ల ముఠా కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. మృతి హోంమంత్రి శనివారం ఉదయం మృతి చెందిన కానిస్టేబుల్ మృతదేహాన్నిసందర్శించి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ వెంకటరెడ్డిని పరామర్శించారు. కాగా ఈశ్వరయ్య మృతదేహానికి పోలీసులు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. -
పోలీసులపై దాడిచేసింది యల్లంగౌడ్ గ్యాంగే
-
'రాత్రి జరిగింది ఊహించని ఘటన'
హైదరాబాద్ : శామీర్‌పేట వద్ద గతరాత్రి జరిగింది ఊహించని ఘటన అని సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసులపై దొంగల ముఠా కత్తులతో దాడి చేసిన విషయం తెలిసిందే. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ వెంకటరెడ్డిని ఆయన శనివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ దొంగలు కత్తులతో దాడి చేసినా పోలీసులు తెగువ చూసించారని ప్రశంసించారు. మరణించిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య మృతదేహాన్ని అతని స్వస్థలం శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. గాయపడ్డ ఎస్ఐ వెంకటరెడ్డి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. రాత్రి పోలీసులపై దాడి చేసింది సిద్ధిపేట యల్లం గౌడ్ గ్యాంగేనని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన ఎల్లంగౌడ్, శ్రీకాంత్ పరారీలో ఉన్నారని, రఘు, నందులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించింది ముజఫర్గా సీవీ ఆనంద్ తెలిపారు. శామీర్ పేట ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన శివారు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. -
పోలీసులపై దాడిచేసింది యల్లంగౌడ్ గ్యాంగే
హైదరాబాద్ : శామీర్ పేటలో పోలీసులపై కత్తులతో దాడి చేసిన దొంగల ముఠా సిద్దిపేట యల్లంగౌడ్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మారుతీ స్విప్ట్ కారులో వచ్చిన అయిదుగురు సభ్యుల ముఠా గతరాత్రి శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేటలో ఈ గ్యాంగ్‌పై పలు కేసులు నమోదు అయ్యాయి. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో ఇద్దరు సభ్యుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సళంత్రి వాసి . మరోవైపు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉదయం ఎస్ఐని పరామర్శించారు. మరోవైపు ఈ దాడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దొంగ మృతిచెందాడు.