ప్రత్యేక రైళ్ల పొడిగింపు
విశాఖపట్నం : వేసవిలో తలెత్తే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి విజయవాడ, ధర్మవరం స్టేషన్ల మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్వేందర్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
*విశాఖ నుంచి విజయవాడ వెళ్లే ప్రత్యేక రైలు(07272) ఏప్రిల్ 1,8,15,22, మే 29 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 07.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
*తిరుగు ప్రయాణంలో 07271 నంబరుతో విజయవాడ నుంచి ఏప్రిల్ 7,14,21,28, మే 5,12,19,26 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఓ సెకండ్‌క్లాస్ ఎ.సి, మరో థర్డ్ క్లాస్ ఎ.సి, ఏడు స్లీపర్ క్లాస్, ఐదు సెకండ్‌క్లాస్ సిట్టింగ్ కంపోజిషన్ ఉండే ఈ జత రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తుంది.
విశాఖ-ధర్మవరం-విశాఖ ప్రత్యేక రైలు
* విశాఖపట్నం నుంచి ధర్మవర ం వెళ్లే విశాఖ-ధర్మవరం ప్రత్యేకరైలు(07273) ఏప్రిల్ 8,15,22,29 , మే 6,13,20, 27 తేదీల్లో సాయంత్రం 04.45 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12.40 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది.
*తిరుగు ప్రయాణంలో 07274 నంబరుతో ఏప్రిల్ 9,16,23,30 తేదీలు, మే 7,14,21,28 తేదీల్లో ధర్మవరం నుంచి మధ్యాహ్నం 02.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 10.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
* ఓ సెకండ్‌క్లాస్ ఎ.సి, మరో థర్డ్ క్లాస్ ఎ.సి, ఏడు స్లీపర్‌క్లాస్, ఐదు సెకండ్‌క్లాస్ సిట్టింగ్ కంపోజిషన్ ఉండే ఈ జత రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని,అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సారావుపేట, వినుకొండ, డోనకొండ, మర్కాపూర్, కుంభం, గిద్దలూరు, నంద్యాల్, బేతం చెర్ల, ధోన్, గూటి, అనంత్‌పూర్ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.