breaking news
earning unemployment
-
నిరుద్యోగ భృతి భ్రాంతేనా?
జిల్లాలో 2.10 లక్షల మంది ఎదురుచూపులు తొలి శాసన సభ సమావేశాల్లో ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు ఇది కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా? ఇంటికో ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఆ ఊసే ఎత్తటం లేదు. యువతను ఆకట్టుకునేందుకు మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా చేర్చిన ఈ హామీ అమలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా యువత ఎదురుతెన్నులు చూస్తున్నారు. చల్లపల్లి : ‘‘ఇంటికో ఉద్యోగం, లేదంటే ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి’’ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇది. ఆయన మాటలు నమ్మి ఆశతో ఓట్లేసిన నిరుద్యోగులు ఎందరో భృతి వస్తుందని ఆశ పడ్డారు. దీనిపై తొలి శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఇది కూడా మిగిలిన పథకాల మాదిరిగా ఎన్నికల హామీలా మిగిలి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. నెలకు రూ.90 లక్షల భారం అధికారుల రికార్డుల ప్రకారం జిల్లాలో 2.10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ పూర్తిచేసినవారు 1.25 లక్షల మంది, పీజీ, సాంకేతిక కోర్సులు పూర్తి చేసిన వారు 48 వేల మంది ఉన్నారు. పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైనవారు మరో 37వేల మంది ఉన్నారు. వీరంతా చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీకి అర్హులే. వీరిలో 29 నుంచి 32ఏళ్లలోపువారు 45వేల మంది. వీరందరికీ భృతి ఇస్తే నెలకు రూ.90 లక్షల భారం ప్రభుత్వంపై పడుతుంది. హామీపై స్పష్టత ఏదీ..! ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రయివేటు ఉద్యోగాలు కూడానని ఇటీవల చంద్రబాబు ప్రకటించడంతో ప్రయివేటు ఉద్యోగులు అనర్హులుగా మారనున్నారు. పదో తరగతి పాసై ఖాళీగా ఉండేవారు నిరుద్యోగుల కిందకే వస్తారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో పదోతరగతి పాసైన వారి నుంచి పీజీ ఉత్తీర్ణులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అలాగే ఇస్తారా? డిగ్రీ, ఆపై వారినే అర్హులుగా గుర్తిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమను బురిడీ కొట్టిం చేందుకే చంద్రబాబు ఇలాంటి హామీ ఇచ్చారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. దుర్భర బతుకులు పీజీ, డిగ్రీ చదివిన యువకులు రూ.5 వేలకన్నా తక్కువ వేతనాలకు ప్రయివేటు ఉద్యోగాలు చేసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు పురుషులు రోజుకు రూ.300, మహిళలు రూ.150 కూలి తీసుకుంటున్నారు. ఏడాదిలో ఐదునెలల పాటు పనులు చేసుకునే పురుషులు రూ.45 వేలు, మహిళలు రూ.20 నుంచి రూ.25వేలు సంపాదిస్తుండగా పీజీ చదివిన చిరుద్యోగులు ఏడాదికి రూ.36 వేల నుంచి రూ.54 వేలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలతో భార్యాపిల్లలతో బతకడం కష్టంగా ఉందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. బాబును నమ్మి మోసపోయాం డిగ్రీ పూర్తిచేసి ఎనిమిదేళ్ళయింది. చంద్రబాబు ఎన్నికల్లో నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. దీనిపై తొలి శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పుడు నుంచి ఇస్తారు, ఎంతవరకు ఇస్తారో ఇంత వరకు చెప్పలేదు. బాబును నమ్మి నాలాంటి నిరుద్యోగులు ఎందరో ఓట్లువేసి మోసపోరు. - జి.వి.ఎస్.కె.నాగకుమార్, అవనిగడ్డ జీవితంలో నమ్మరు ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబును నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని, కమిటీ వేసి మాట తప్పారు. ఇంటికో ఉద్యోగం, లేదా రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చినా దాని ఊసేలేదు. హామీలను నిలబెట్టుకోకపోతే బాబును జీవితంలో ఇక ఎవరూ నమ్మరు. - గుడివాక రామాంజనేయులు, అవనిగడ్డ -
నిరుద్యోగ భృతి
మేనిఫెస్టోను విడుదల చేసిన దేవెగౌడ కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు వాటికి ఎంతసేపూ రాజకీయంగా బలపడాలన్న యావే కావేరి, కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి అన్యాయం జాతీయ రాజకీయాల్లో భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగర యువతకు నిరుద్యోగ భృతి, అవినీతి సొమ్ము స్వాధీనానికి ప్రయత్నాలు, నదీ జలాల పంపకానికి ఏక రూప జాతీయ విధానం, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహం లాంటి హామీలతో జేడీఎస్ శుక్రవారం లోక్సభ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడ 20 పేజీలతో కూడిన ‘మా సంకల్పం’ పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నదీ జలాల పంపకంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ఆరోపించారు. రాజకీయంగా బలపడాలనే యావ తప్ప వాటికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని నిష్టూరమాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి అంతర్ రాష్ట్ర జలాల పంపకానికి సంబంధించి జాతీయ విధానాన్ని ప్రకటించాల్సిందిగా జేడీఎస్ కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని తెలిపారు. అవసరమైతే దీనిపై పోరాటానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. ప్రతి నదికీ ఓ విధానం రాష్ట్రం పాలిట శాపంలా తయారైందని, కావేరి, కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా దక్కలేదని ఆరోపించారు. గ్రామీణాభివృద్ధిని పట్టణాభివృద్ధితో అనుసంధానం చేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంధి కాలంలో మున్ముందు జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర పరిమితమవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని అన్నారు.