breaking news
drought funds
-
యూరిన్ బాటిల్స్‌తో రైతుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ఆందోళన కొనసాగుతోంది. రుణమాఫీ, కరువు సాయం చేయాలంటూ రోజుకో రూపంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న రైతులు శనివారం మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యను ఎంత తీవ్రంగా తెలుపుతూ, ఇప్పటికైనా తమను ఆదుకోవాలని.. ‘తమ మూత్రం తామే తాగుతామంటూ’ యూరిన్ బాటిల్ ముందు పెట్టుకుని తమ ఆందోళన ఉధృతం చేశారు. కరువు నిధులను విడుదల చేయాలని, కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తమిళనాడుకు చెందిన రైతుల బృందం మార్చి 14 నుంచి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలను చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారని, సాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమని ఆదుకోండి మహాప్రభో అని దీనంగా వేడుకుంటున్నారు. గతంలో రైతులు నగ్నంగా ఆందోళనలు, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు, చనిపోయిన పాములను నోట కరిచినా, చీరలు కట్టుకుని నిరసన తెలిపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాయం తమకు సరిపోదంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన
-
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన
న్యూఢిల్లీ: కరవు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీలు కట్టుకుని రహదారులపై నడుస్తూ కరవు సాయం మంజూరు చేయండి అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని తెలిపారు.