breaking news
DRDA PD Nellore
-
ఓడీఎఫ్‌గా జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం
గాదెలదిన్నె (విడవలూరు): జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చేందుకు ప్రజల సహకారం అవసరమని డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి పేర్కొన్నారు. మండలంలోని గాదెలదిన్నెలో బుధవారం ఆత్మగౌరవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న గాదెలదిన్నెలో రెండో విడతలతో కేవలం నెల రోజుల వ్యవధిలో 102 మరుగుదొడ్లను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన సర్పంచ్ శేషయ్యను అభినందించారు. గాదెలదిన్నెలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. బహిరంగా మల విసర్జన రహిత గ్రామంగా ఆమోదించడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలు గాదెలదిన్నెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఏపీఎం అమరావతి, ఎంపీటీసీ సభ్యులు శారద, తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు
డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని 43 పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు మంజూరైనట్లు డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో వెలుగు ఏపీఎంలు, ఏసీలు, డీపీఎంలతో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 10వ తేదీలోగా 3వేల కంపోస్టు తొట్టెలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చంద్రన్న బీమాలో సభ్యులను చేర్పించాలని ఏపీఎంలను ఆదేశించారు. పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. డీఆర్డీఏ ఏపీడీ ప్రసన్నలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.